అమెరికాలో ఎన్నారై ఫ్యామిలీ కిడ్నాప్‌.. న‌లుగురి మృత‌దేహాలు ల‌భ్యం

Indian-Origin Family of 4 Kidnapped in California Found Dead
x

అమెరికాలో ఎన్నారై ఫ్యామిలీ కిడ్నాప్‌.. న‌లుగురి మృత‌దేహాలు ల‌భ్యం

Highlights

Indian-Origin Family: అమెరికాలో కిడ్నాప్‌కు గురైన NRI కుటుంబ సభ్యులు హత్యకు గురయ్యారు.

Indian-Origin Family: అమెరికాలో కిడ్నాప్‌కు గురైన NRI కుటుంబ సభ్యులు హత్యకు గురయ్యారు. సోమవారం కాలిఫోర్నియాలోని మెర్సిడెస్‌ కౌంటీలో నివాసం ఉంటున్న జస్దీప్‌ సింగ్‌, భార్య జస్దీప్‌ కౌర్‌, ఎనిమిది నెలల కూతురితోపాటు అనుదీప్‌ సింగ్‌ అనే మరో వ్యక్తిని దుండగుడు తుపాకీతో బెదిరించి కిడ్నాప్‌ చేశాడు.. అదే రోజు అమన్‌ దీప్ సింగ్‌ అనే వ్యక్తి జస్దీప్‌ కార్యాలయం సమీపంతో దహనమై కనిపించాడు.. మిగిలిన ముగ్గురు విగత జీవులై పడి ఉన్న ఘటన ఆలస్యంగా బయట పడింది. దుండుగుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. హంతకుడు జస్దీప్‌ సింగ్‌ ఏటీఎం కార్డు ఉపయోగించి నగదు డ్రా చేసుకోవడంతో డబ్బు దోచుకోవడానికే కిడ్నాప్‌ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories