భారతదేశ డాక్టరమ్మ కు అమెరికా ప్రజల జేజేలు!

భారతదేశ డాక్టరమ్మ కు అమెరికా ప్రజల జేజేలు!
x
Highlights

త‌మ వ్య‌క్తిగ‌త జీవితాల‌ను దూరం చేసుకొని మ‌రీ కరోనా బాధితుల‌కు సేవ‌లు చేస్తున్న వైద్యుల‌కు అక్క‌డి ప్ర‌జ‌లు, ప్ర‌భుత్వ అధికారులు త‌మ‌దైన శైలిలో...

త‌మ వ్య‌క్తిగ‌త జీవితాల‌ను దూరం చేసుకొని మ‌రీ కరోనా బాధితుల‌కు సేవ‌లు చేస్తున్న వైద్యుల‌కు అక్క‌డి ప్ర‌జ‌లు, ప్ర‌భుత్వ అధికారులు త‌మ‌దైన శైలిలో ప్ర‌త్యేకంగా గౌరవ మ‌ర్యాద‌లు చేస్తున్నారు. అమెరికాలో సౌత్ విన్సడర్‌ ఆసుపత్రిలో వైద్యురాలుగా సేవలందిస్తున్నభారతీయ వైద్యురాలికి అటువంటి అరుదైన గౌరవం దక్కింది. ఆమె చేస్తున్న సేవలను ప్రభుత్వం ప్రశంసపూర్వకంగా ఆమె ఇంటి ముందు పెరేడ్ నిర్వహించింది.

అమెరికాలో క‌రోనా బాధితుల‌కు చికిత్స చేసేందుకు అక్క‌డి వైద్యులు రెయింబవళ్లు క‌ష్ట‌ప‌డుతున్నారు. దేశంలోని ఆస్ప‌త్రుల‌న్ని క‌రోనా పేషెంట్ల‌తోనే నిండిపోయాయి. దీంతో క‌రోనా బాధితుల‌కు చికిత్స అందించే క్రమంలో వైద్యులు రోజుల త‌ర‌బ‌డి త‌మ కుటుంబాల‌కు కూడా దూరం అవుతున్నారు. ఇలా త‌మ వ్య‌క్తిగ‌త జీవితాల‌ను దూరం చేసుకొని మ‌రీ బాధితుల‌కు సేవ‌లు చేస్తున్న వైద్యుల‌కు అక్క‌డి ప్ర‌జ‌లు, ప్ర‌భుత్వ అధికారులు, తోటివాళ్లు త‌మ‌దైన శైలిలో ప్ర‌త్యేకంగా గౌరవ మ‌ర్యాద‌లు చేస్తున్నారు.

సౌత్ విన్స‌డ‌ర్ ఆస్ప‌త్రిలో ప‌నిచేసే భార‌త్‌లోని మైసూర్‌కు చెందిన ఉమా మ‌ధుసూద‌న అనే వైద్యురాలికి అరుదైన గౌర‌వం ద‌క్కింది. క‌రోనా బాధితుల‌కు మ‌ధుసూద‌న చేస్తున్న సేవ‌ల‌కు గాను అధికారులు ఆమె ఇంటిముందు నుంచి ప్ర‌భుత్వ వాహ‌నాల‌తో ప‌రేడ్‌ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఇరుగుపొరుగు వారు ఇళ్ల నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి చ‌ప్ప‌ట్లు కొడుతూ ఆమె సేవ‌ల‌కు సెల్యూట్ చేశారు.

అమెరికాలో క‌రోనా బాధితుల‌కు సేవ‌లు చేస్తున్న‌ వైద్యుల‌ను ఇలా ప్ర‌త్యేకంగా గౌర‌వించి స‌న్మానిస్తుంటే భారతదేశంలో మాత్రం వైద్యుల‌పై దాడుల‌కు తెగ‌బ‌డుతున్నారు కొంద‌రు అల్ల‌రి మూక‌లు. ఇది నిజంగా బాధక‌రం. ప్ర‌స్తుత విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో త‌మ ప్రాణాల‌ను సైతం ప‌ణంగా పెట్టి రోగుల‌ను కాపాడేందుకు కృషి చేస్తున్న డాక్ట‌ర్ల ప‌ట్ల ఇలా అమానుషంగా ప్ర‌వ‌ర్తించ‌డంతో పోలీసులు రంగంలో దిగి కేసులు నమోదు చేస్తున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories