India-US Interim Trade Deal: భారత్‌ అమెరికా మధ్య ట్రేడ్‌ డీల్‌ ఖరారు

India-US Interim Trade Deal: భారత్‌, అమెరికా మధ్య మధ్యంతర వాణిజ్య ఒప్పందం ఖరారయ్యింది.

Arun Chilukuri
Published on: 7 Feb 2026 10:54 AM IST
India-US Interim Trade Deal: భారత్‌ అమెరికా మధ్య ట్రేడ్‌ డీల్‌ ఖరారు
X

India-US Interim Trade Deal: భారత్‌, అమెరికా మధ్య మధ్యంతర వాణిజ్య ఒప్పందం ఖరారయ్యింది. భారత్‌ ఉత్పత్తులపై 50% సుంకాలను 18 శాతానికి తగ్గిస్తున్నట్లు అమెరికా అధికారిక ముసాయిదా విడుదల చేసింది. వాణిజ్య ఒప్పందంతో అదనపు మార్కెట్‌ ప్రవేశిస్తుందని ప్రకటించింది.

అమెరికా నుంచి భారీగా ఇంధనం గ్యాస్‌ను.. భారత్‌ దిగుమతి చేసుకోనుందని ప్రకటనలో వెల్లడించింది. 500 బిలియన్ డాలర్ల విలువైన ఎనర్జీ, టెక్నాలజీ, బొగ్గు, వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలుకు భారత్ అంగీకారించినట్లు పేర్కొంది. జనరిక్ మందులు, విమాన విభాగాలు, రత్నాలు, వజ్రాలపై సుంకాలను తొలగించేందుకు అమెరికా అంగీకరించింది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story