Pakistan: పాక్‌కు అమెరికా సాయంపై భారత్‌ నిరసన

India Protests Against US Aid to Pakistan | Telugu News
x

Pakistan: పాక్‌కు అమెరికా సాయంపై భారత్‌ నిరసన

Highlights

Pakistan: పాకిస్థాన్‌కు ఎఫ్‌-16 ఫైటర్‌ జెట్లకు అమెరికా అప్డేట్‌

Pakistan: పాకిస్థాన్‌కు తాజాగా అమెరికా ప్రకటించిన సైనిక సాయంపై భారత్‌ నిరసన వ్యక్తం చేసింది. అమెరికా, భారత్‌ మధ్య 2+2 ఉన్నతాధికారుల సమావేశం జరిగిన మరుసటి రోజే ఎఫ్‌-16 యుద్ధ విమానాలను అప్‌గ్రేడ్‌ చేసేందుకు పాకిస్థాన్‌కు 45 కోట్ల డాలర్ల విలువైన భారీ సాయం చేస్తామని బైడెన్‌ ప్రకటించారు. ఉగ్రవాద నిరోదక చర్యల్లో భాగంగా ఎఫ్‌-16 ఫైటర్‌ జెట్లను అపగ్రేడ్‌ చేస్తున్నట్టు తెలిపింది. దీనిపై భారత్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆ మేరకు అమెరికా విదేశాంగ ప్రతినిధి డొనాల్డ్‌ ల్యూకు భారత్‌ ఆందోళన వ్యక్తం చేసింది. ఎఫ్‌-16 ఫైటర్‌ జెట్లను దుర్వినియోగం చేసిన విషయాన్ని గుర్తు చేసింది. భారత్‌తో స్నేహ సంబంధాలను కొనసాగిస్తూనే పాక్‌ను తమపైకి ఉసిగొలిపే చర్యలుగా ఢిల్లీ పేర్కొన్నది.

అఫ్ఘానిస్థాన్‌లోని తాలిబన్‌, హక్కానీ నెట్‌ వర్క్‌ ఉగ్రవాదులను అణచివేయడంలో పాకిస్థాన్‌ విఫలమైందని డొనాల్డ్‌ ట్రంప్ సర్కారు ఆరోపించింది. ఆమేరకు 2018లో పాకిస్థాన్‌కు ఇస్తామన్న 200 కోట్ల డాలర్ల భద్రతా సహాయాన్ని నిలిపేసింది. . ఉగ్రవాద పోరాటంలో పాకిస్థాన్‌ తమ భాగస్వామి కాదని స్పష్టం చేశారు. నాలుగేళ్ల తరువాత.. తాజాగా బైడెన్‌ ప్రభుత్వం సహాయాన్ని పునరుద్ధరించింది. పాక్‌కు ఇప్పుడు అందిస్తున్న సహాయంలో కొత్త ఆయుధాలు కానీ, కొత్త బాంబులు, క్షిపణులు కానీ ఉండవనీ, ఎఫ్‌ 16లకు కొత్త పోరాట సామర్థ్యాన్ని సమకూర్చడమూ జరగదని తమ కాంగ్రెస్‌కు బైడెన్‌ సర్కారు తెలియజేసింది. దీనివల్ల దక్షిణాసియా ప్రాంతంలో బలాబలాల సమతూకంలోనూ మార్పు రాదని వివరించింది. ఉగ్రవాదంపై ప్రస్తుత, భావి పోరులో అమెరికా, నాటో దళాలతో కలసిపనిచేయడానికి పాకిస్థాన్‌కు ఈ సహాయం ఉపకరిస్తుందని తెలిపింది.

కానీ పాకిస్థాన్‌ మాత్రం ఉగ్రవాద నిరోధానికి కాకుండా.. భారత్‌వైపు గురిపెడుతోంది. 2019 మార్చిలో ఈ ఎఫ్‌-16 యుద్ధ విమానాలతోనే దాడికి దిగింది. ఈ దాడులను వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్దమాన్‌.. మిగ్‌ బైసన్‌ యుద్ధ విమానంతో నిలువరించారు. దీనికి సంబంధించి ఆధారాలను కూడా భారత్‌ చూపించింది. పాకిస్థాన్‌కు చెందిన అమ్రామ్‌ క్షిపణులను తీసుకెళ్లే సామర్థ్యం ఎఫ్‌-16 యుద్ధ విమానాలకు మాత్రమే ఉంది. ఈ విషయమై భారత్‌ అప్పట్లో ఎండగట్టింది. ఉగ్రవాదంపై పోరాడేందుకు మాత్రమే వినియోగించాల్సిన ఈ యుద్ధ విమానాలను భారత్‌పై గురి పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే తాము ఎఫ్‌-16 యుద్ధ విమానాలు వాడలేదని పాకిస్థాన్ బుకాయించింది. భారత్‌ అందించిన సాక్ష్యాలు ఆధారంగా చర్యలు తీసుకుంటామని అప్పట్లో అమెరికా కూడా ప్రకటించింది. నిజానికి 2016లోనే ఎఫ్‌-16 యుద్ధ విమానాలను భారత్‌పై పాకిస్థాన్‌ ప్రయోగించే ముప్పు ఉందని ఆందోళన వ్యక్తమైంది. అప్పట్లో 8 ఎఫ్‌-16 ఫైటర్‌ జెట్లను అమెరికా చట్ట సభ్యులు అడ్డుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories