అమెరికా బాట పట్టిన విద్యార్థుల్లో భారత్ రెండో స్థానం

అమెరికా బాట పట్టిన విద్యార్థుల్లో భారత్ రెండో స్థానం
x
Highlights

చాలా మంది విద్యార్థులు వారి పై చదువులను దూర దేశాలలో కొనసాగించాలని అనుకుంటారు. అందులోనూ అమెరికా ఐతే ఇంకా బెటర్ అనుకుంటారు. అయితే ఇలా అనుకుని అమెరికాలో...

చాలా మంది విద్యార్థులు వారి పై చదువులను దూర దేశాలలో కొనసాగించాలని అనుకుంటారు. అందులోనూ అమెరికా ఐతే ఇంకా బెటర్ అనుకుంటారు. అయితే ఇలా అనుకుని అమెరికాలో విద్యాభ్యాసం చేయడానికి వెళుతున్న విద్యార్థుల సంఖ్యలో భారత్ రెండో స్థానంలో ఉంటే, చైనా విద్యార్థులు మాత్రం మొదటి స్థానంలో ఉన్నారు.

ఈ విద్యాసంవత్సరంలో మొత్తం 10 లక్షల మందికి పైగా విద్యార్థులు అమెరికాకు వెళ్లారని, వీరిలో 3.69 లక్షల మంది విద్యార్థులు చైనాకు చెందినవారు కాగా, మరో 2,02,014 మంది విద్యార్థులు భారత్ నుంచి వెళ్లారు.

ఈ విషయాలకు సంబంధించిన సమాచారాన్ని 2019 విద్యా సంవత్సరానికి సంబంధించిన 'ఓపెన్ డోర్స్ రిపోర్ట్ ఆన్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషనల్ ఎక్చేంజ్' అనే నివేదికలో వెళ్లడిచేశారు. అంతే కాకుండా ప్రపంచ దేశాలనుంచి అమెరికాలోకి వచ్చే విద్యార్థుల సంఖ్య, వారి ద్వారా దేశానికి వచ్చే ఆదాయాలకు సంబంధించిన గణాంకాలను కూడా ఈ నివేదికలో సమర్పించారు.

ఈ నేపధ్యంలోనే అమెరికాకు తరలుతున్న విద్యార్థల మూలంగా ఆ దేశానికి 2018లో 44.7 బిలియన్ డాలర్ల ఆదాయం వచ్చిందని తెలిపారు. పోయిన ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది 5.5శాతం ఆదాయం వృద్ధి చెందిందని వెల్లడించారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories