కుక్క పేరున రూ. 36కోట్ల ఆస్తి

కుక్క పేరున రూ. 36కోట్ల ఆస్తి
x

కుక్క పేరున రూ. 36కోట్ల ఆస్తి

Highlights

సాధారణంగా మనుషుల కన్నా జంతువులకు విశ్వాసం, ప్రేమాభిమానాలు ఎక్కువగా ఉంటాయి. వాటి పట్ల కాస్త ఆదరణ చూపిస్తే చాలు జీవితాంతం మనల్ని అంటి పెట్టుకుని ఉంటాయి....

సాధారణంగా మనుషుల కన్నా జంతువులకు విశ్వాసం, ప్రేమాభిమానాలు ఎక్కువగా ఉంటాయి. వాటి పట్ల కాస్త ఆదరణ చూపిస్తే చాలు జీవితాంతం మనల్ని అంటి పెట్టుకుని ఉంటాయి. శునకాల్లో ఈ విశ్వాసం ఇంకాస్త ఎక్కువగా ఉంటుంది. అందుకే చాలా మంది పెంపుడు జంతువుగా కుక్కలను పెంచుకోవడానికి ఆసక్తి చూపుతారు. ఎందుకంటే అవి మన నుంచి ప్రేమను తప్ప ఇంకేం ఆశించవు.

చెప్పాలంటే కొందరు శునకాన్ని కుటుంబ సభ్యులతో సమానంగా కూడా చూసుకుంటారు. కానీ ఏకంగా దానికి ఆస్తిలో వాటా కూడా ఇచ్చేశాడు అమెరికాలోని టేన్నసిలో నివసించే వ్యక్తి. తన వీలునామాలో పెంపుడు కుక్కపేరు మీద 5 మిలియన్‌ డాలర్ల ఆస్తి రాశాడు. భారతీయ కరెన్సీలో చెప్పాలంటే 36కోట్ల రూపాయలు అన్నమాట. దానిపై తనకు ఉన్న ప్రేమ కారణంగానే వీలునామాలో రాశానంటున్నాడు.

టేన్నసీకి చెందిన బిల్‌ డోరిస్‌ అనే వ్యక్తి ఎనిమిదేళ్లుగా లులు అనే ఓ కుక్కను పెంచుకుంటున్నాడు. ట్రావేలింగ్‌ హాబీ కల డోరీస్‌ తరచుగా ప్రయాణాలు చేసేవాడు. ఈ సమయంలో పెంపుడు కుక్క లులుని తన స్నేహితుడు మార్ట్‌ బర్టన్‌ దగ్గర వదిలేసి వెళ్లేవాడు. ఈ క్రమంలో గతేడాది డోరిస్‌ మరణించాడు. అప్పటి నుంచి లులు బాధ్యతని మార్టనే తీసుకున్నాడు. ఇలా ఉండగా కొద్ది రోజుల కిత్రం డోరిస్‌ లాయర్‌ ఆయన చనిపోవడానికి ముందు రాసిన వీలునామాను మార్ట్‌కి అందించాడు. దానిలో డోరిస్‌ తన పెంపుడు కుక్క లులు పేరిట 5 మిలియన్‌ డాలర్ల ఆస్తి రాసినట్లు గుర్తించాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories