గడచిన 24 గంటల్లో అమెరికాలో 1, 754 మంది మృతి

గడచిన 24 గంటల్లో అమెరికాలో 1, 754 మంది మృతి
x
Highlights

అగ్రరాజ్యం అమెరికాలో కొవిడ్‌ బీభత్సం కొనసాగుతోంది. వేలకొద్దీ ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి.కరోనా మహమ్మారి ధాటికి అమెరికా విలవిల్లాడుతోంది. ఏ దేశంలో...

అగ్రరాజ్యం అమెరికాలో కొవిడ్‌ బీభత్సం కొనసాగుతోంది. వేలకొద్దీ ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి.కరోనా మహమ్మారి ధాటికి అమెరికా విలవిల్లాడుతోంది. ఏ దేశంలో లేనంతగా అమెరికాలో కల్లోలం సృష్టిస్తున్న కరోనా.. యుద్ధం కంటే ఎక్కువ ప్రాణనష్టం కలిగిస్తోంది. అమెరికాలో నిన్న ఒక్క రోజే 26,398 కేసులు వెలుగుచూశాయి. 1,703 మంది మరణించారు. అమెరికాలో మొత్తంగా 86,900 మంది కరోనా వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోయారు. మరణాల్లోనూ, కేసుల్లోనూ అమెరికా ప్రపంచంలోనే ముందుండడం గమనార్హం.

అటు బ్రెజిల్, యూకేలో కరోనా వైరస్ చెలరేగిపోతోంది. ప్రపంచవ్యాప్తంగా నిన్న ఒక్క రోజే లక్ష కేసులు నమోదు కాగా, అమెరికాలో 26,398 కేసులు వెలుగుచూశాయి. బ్రెజిల్‌లో 13,761, రష్యాలో 9,974 కేసులు నమోదయ్యాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories