ఇమ్రాన్ ఖాన్‌కు అల్‌ఖాదిర్ కేసులో 14 ఏళ్ల జైలు

ఇమ్రాన్ ఖాన్‌కు అల్‌ఖాదిర్ కేసులో 14 ఏళ్ల జైలు
x

ఇమ్రాన్ ఖాన్‌కు అల్‌ఖాదిర్ కేసులో 14 ఏళ్ల జైలు

Highlights

ఇమ్రాన్ ఖాన్ కు ఆల్ ఖాదిర్ కేసులో ఆయనతో పాటు ఆయన భార్య బుష్రా బీబీ దోషులుగా తేల్చింది కోర్టు. ఈ కేసులో ఇమ్రాన్ ఖాన్ కు 14 ఏళ్ల జైలు శిక్ష పడింది.

ఇమ్రాన్ ఖాన్ కు ఆల్ ఖాదిర్ కేసులో ఆయనతో పాటు ఆయన భార్య బుష్రా బీబీ దోషులుగా తేల్చింది కోర్టు. ఈ కేసులో ఇమ్రాన్ ఖాన్ కు 14 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఆయన భార్యకు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది కోర్టు. లండన్ లో ఉంటున్న పాకిస్తాన్ వ్యాపారి మాలిక్ రియాజ్ హుసేన్ నుంచి వసూలు చేసిన 19 కోట్ల పౌండ్లను బ్రిటన్ పాక్ కు పంపితే ఆ సొమ్మును ఇమ్రాన్ ఖాన్ దంపతులు దుర్వినియోగం చేశారనేది ఆరోపణ. ఈ కేసును ల్‌ఖాదిర్ ట్రస్ట్ కేసుగా పిలుస్తారు.

సుప్రీంకోర్టు గతంలో రియాజ్ హుసేన్ కు విధించిన జరిమానాలో కొంత మొత్తాన్నిఈ నగదులో నుంచి కట్టేందుకు అనుమతించారని అభియోగం. దీనికి బదులుగా ఇమ్రాన్ దంపతులు నెలకొల్పే ఆల్ ఖాదిర్ యూనివర్శిటీకి ఆయన 57 ఎకరాలను గిఫ్ట్ గా ఇచ్చారనేది ఆరోపణ. ఇమ్రాన్ దంపతులు ఏర్పాటు చేసిన ట్రస్టులో జుల్ఫీ బుఖారీ, బాబర్ అవాన్, అప్పటి ప్రథమ మహిళ బుష్రా, ఆమె సన్నిహితుడు ఫర్హత్ షెహజాది సహా పలువురు పిటిఐ నాయకులు ట్రస్ట్ సభ్యులుగా నామినేట్ అయ్యారు.

కేబినెట్ ఆమోదం తర్వాత ఇమ్రాన్ ఖాన్ సన్నిహితుడు బఖారీ కి భూమికి ఇచ్చారని ఆరోపించారు. బుఖారీ, అవాన్ తప్పుకున్న తర్వాత ఆ భూమిని ట్రస్ట్ కు బదిలీ చేశారు. ఇది ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్, బుష్రా, ఫరా పేరిట ఉంది.దీనిపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. 2023 మే 9న ఇమ్రాన్ ఖాన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ అరెస్టుతో ఇమ్రాన్ ఖాన్ పార్టీ పీటీఐ మద్దతుదారులు చేసిన నిరసనలు హింసకు దారితీశాయి.2023 ఆగస్టు నుంచి ఇమ్రాన్ ఖాన్ జైల్లోనే ఉన్నారు. ఆయనపై 200కి పైగా కేసులు నమోదయ్యాయి. రాజకీయ కక్షతోనే తనపై కేసులు నమోదు చేశారని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories