భారత్‌తో వాణిజ్య సంబంధాలపై పాక్‌ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కీలక నిర్ణయం

Imran Khan
x

ఇమ్రాన్ ఖాన్ ఫైల్ ఫొతో 

Highlights

Imran Khan: భారత్‌తో వాణిజ్య సంబంధాలపై పాక్‌ ప్రధాని కీలక నిర్ణయం తీసుకున్నారు.

Imran Khan: ప్రస్తుత పరిస్థితుల్లో భారత్‌తో వాణిజ్య సంబంధాలను పునరుద్ధరించరాదని పాక్‌ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నిర్ణయించారు. కీలక మంత్రులతో నిర్వహించిన భేటీలో ఇమ్రాన్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు పాకిస్థాన్ మీడియా శనివారం తెలిపింది. దేశంలో చక్కెర, ప్రత్తి తదితరాల అందుబాటుపై చర్చించేందుకు.. ఇమ్రాన్ ఖాన్ శుక్రవారం కేబినెట్ మంత్రులతో సమావేశమయ్యారు. అవసరమైన సరుకులను చౌకగా దిగుమతి చేసుకునేందుకుగల ప్రత్యామ్నాయాలను అన్వేషించాలని వాణిజ్య మంత్రిత్వ శాఖను ఆదేశించారని తెలిపింది.

చక్కెర, ప్రత్తిని భారత్‌ నుంచి దిగుమతి చేసుకోవాలని ఎకనమిక్ కోఆర్డినేషన్ కమిటీ ప్రతిపాదించింది. అయితే ఇమ్రాన్‌ ఖాన్‌ దీన్ని వ్యతిరేకించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో భారత్‌తో వాణిజ్య సంబంధాలు పునరుద్ధరించడం సాధ్యం కాదని కేబినెట్్ భేటీలో ఇమ్రాన్‌‌ఖాన్‌ తేల్చి చెప్పినట్లు తెలిసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories