కరోనా ఎలా సోకే అవకాశం ఉంది.. దీని నుంచి మనల్నిమనం ఎలా కాపాడుకోవాలి?

కరోనా ఎలా సోకే అవకాశం ఉంది.. దీని నుంచి మనల్నిమనం ఎలా కాపాడుకోవాలి?
x
Highlights

కరోనా ఎలా సోకే అవకాశం ఉంది? లక్షణాలు ఎలా ఉంటాయి? దీని నుంచి మనల్నిమనం ఎలా కాపాడుకోవాలి? వాచ్ దిస్ స్టోరీ. కరోనా వైరస్ మిగిలిన ప్రమాదకరమైన వైరస్‌ల...

కరోనా ఎలా సోకే అవకాశం ఉంది? లక్షణాలు ఎలా ఉంటాయి? దీని నుంచి మనల్నిమనం ఎలా కాపాడుకోవాలి? వాచ్ దిస్ స్టోరీ.

కరోనా వైరస్ మిగిలిన ప్రమాదకరమైన వైరస్‌ల మాదిరిగా గాలిలో ప్రయాణించలేదు. కానీ, వైరస్‌ బారినపడ్డ వ్యక్తితో నేరుగా కాంటాక్ట్ పెట్టుకుంటే మాత్రం వైరస్ సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. నేరుగా కాంటాక్ట్ పెట్టుకోవడం అంటే వైరస్ బారిన పడ్డ వ్యక్తితో రెండు మీటర్ల కన్నా తక్కువ దూరంలో 15 నిముషాల కన్నా ఎక్కువ సేపు ఉండటం. వైరస్ బాధితుడు దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు వెలువడే తుంపరల ద్వారా కోవిడ్19 వైరస్ వ్యాప్తి చెందుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ వైరస్ ఏదైనా వస్తువుకు అంటిపెట్టుకుని సజీవంగా చాలా కాలంపాటు ఉంటుంది. చల్లని ప్రదేశాల్లో తొమ్మిది రోజుల వరకూ ఇది బతికుండే అవకాశం ఉందని డాక్టర్లు చెబుతున్నారు.

వైరస్ ఉన్న వస్తువులపై చేతులు వేసిన వాళ్లకూ అది సోకే ప్రమాదం ఉంది. మెట్రో స్టేషన్లలో ఎస్కలేటర్ల హ్యాండ్ రెయిల్స్, మెట్రో రైళ్లలో నిలబడేటప్పుడు పట్టుకునే హ్యాండిళ్లు, బస్సుల్లో సీట్ల వెనుక ఉండే హ్యాండిళ్లు వంటి వాటిపై చేతులు వేయకుండా ఉంటే మంచిది. ఆ వస్తువులను పట్టుకుని, తర్వాత ఆ చేతితో ముఖాన్ని, నోటిని, ముక్కు, కళ్లను తాకితే వైరస్ నేరుగా శరీరంలోకి వెళ్లిపోయే చాన్సు ఉంది.

కరోనావైరస్ ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నవారు తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలి, ముఖ్యంగా మూడు కిలోమీటర్ల పరిధిలోని వారు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఎప్పటికప్పుడు చేతుల్ని శుభ్రపరచుకోవాలి. దగ్గు, జలుబుతో బాధపడుతున్న వారికి కనీసం ఒక మీటరు నుంచి మూడు మీటర్ల దూరంలో ఉండాలి. ఆ రెండు లక్షణాలతో బాధపడుతున్నవారు తుమ్మినా లేదా దగ్గినా టిష్యూ లేదా బట్ట అడ్డు పెట్టుకోవడం, ఎదురుగా ఉన్న వ్యక్తికి దూరంగా ఉండాలి. ప్రయాణాల్లో, షాపింగ్ సమయాల్లో, ఆఫీసుల్లో అవసరమైన ప్రతి వస్తువును చేతితో తాకుతునే ఉంటాం. ఆ సమయంలో వైరస్ సోకే అవకాశం ఉంది. అవే చేతులతో కళ్లను నలిపినా, ముక్కును, నోటిని తాకినా ఆ వైరస్ శరీరంలోకి ప్రవేశించవచ్చు. కనుక అదే పనిగా చేతులతో కళ్లను, నోటిని, ముక్కును తాకవద్దు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories