European Space Agency: భూ అయస్కాంత కేత్రం నుంచి వణికించే శబ్దాలు..

Haunting Sound Of Earths Magnetic Field Released By European Space Agency
x

European Space Agency: భూ అయస్కాంత కేత్రం నుంచి వణికించే శబ్దాలు..

Highlights

European Space Agency: ఐరోపా స్పేస్‌ ఏజెన్సీ పరిశోధకులు భూమిని పరిశీలిస్తున్నప్పుడు ఓ వింత శబ్దాలను గమనించారు.

European Space Agency: ఐరోపా స్పేస్‌ ఏజెన్సీ పరిశోధకులు భూమిని పరిశీలిస్తున్నప్పుడు ఓ వింత శబ్దాలను గమనించారు. ఆ శబ్దాలు వింటే.. ఒంట్లో వణుకు పుడుతుంది. ఇంతకు ఆ శబ్దాలు ఎక్కడి నుంచి వస్తాయని ఆరా తీశారు. దీంతో వారికి వస్తుపోయే నిజం తెలిసింది. ఆ భయంకరమైన శబ్దాలు భూ అయస్కాంత క్షేత్రంలోని తరంగాలు విడుదల చేస్తున్నట్లు గుర్తించారు. తాజాగా 5 నిమిషాలు ఉన్న ఓ ఆడియను ఐరోపా స్పేస్‌ ఏజెన్సీ విడుదల చేసింది.

భూగ‌ర్భంలోని మాగ్నెటోస్పియ‌ర్ నుంచి తరంగాలు విడుదలవుతున్నాయి. టెక్నిక‌ల్ యూనివ‌ర్సిటీ ఆఫ్ డెన్మార్క్‌కు చెందిన ప‌రిశోధ‌కులు మ్యాగ్నటిక్ సిగ్నల్స్‌ను స్టడీ చేశారు. స్వార్మ్ శాటిలైట్ మిష‌న్ ద్వారా ఆ అయ‌స్కాంత త‌రంగాల‌ను ప‌రిశీలిస్తున్నారు. అయ‌స్కాంత క్షేత్రం నుంచి రిలీజ్ అవుతున్న త‌రంగాల‌ను స్వార్మ్ శాటిలైట్‌ ధ్వనిగా మారుస్తోంది. భూమి పగుళ్ల నుంచి ఆ శబ్దాలు వస్తున్నట్టు తెలిపారు. డెన్మార్క్‌లోని కోపెన్‌హెగ‌న్‌లో ఉన్న సోల్‌బెర్గ్ స్క్వేర్‌లోని లౌడ్ స్పీక‌ర్లతో అక్టోబ‌ర్ 24న ఆ ధ్వనుల‌ను మూడుసార్లు రికార్డు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories