భారతీయ విద్యార్థుల్లో అమెరికా కల చెదిరిపోతుందా? హెచ్‌1బీ ఎంపికైనా ఇక అంతేనా..

భారతీయ విద్యార్థుల్లో అమెరికా కల చెదిరిపోతుందా? హెచ్‌1బీ ఎంపికైనా ఇక అంతేనా..
x
Highlights

భారతీయులకు అమెరికాలో కల చెదిరిపోయినుందా.? హెచ్‌1బీ విసా వున్న కొలువుల పరిస్థితి ఎంటి?. ఇప్పుడు మనదేశ విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది

భారతీయులకు అమెరికాలో కల చెదిరిపోయినుందా.? హెచ్‌1బీ విసా వున్న కొలువుల పరిస్థితి ఎంటి?. ఇప్పుడు మనదేశ విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. ఎందుకంటే కరోనా సృష్టిస్తున్న భీభత్సం అంతా ఇంతా కాదు. ప్రపంచ దేశాల నీటిని గడగడలాడిసుంది. ఈ మహమ్మారి అమెరికాలో మరింతగా రెచ్చిపోయింది. ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థల పైన అగ్రరాజ్యం అమెరికా ఆర్ధిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తుంది.

స్వదేశంలో ఇంజనీరింగ్ పూర్తి చేసి... అమెరికాలో ఎంఎస్‌ చేయాలని.. ఆ తర్వాత మూడే ళ్లు ఓపీటీ, శిక్షణలో ఉండగానే హెచ్‌1బీ వీసాకు దరఖాస్తు. హెచ్‌1బీ వస్తే మూడేళ్లపాటు అక్కడే. ఈ లోగా ఏదైనా కంపెనీలో ఉద్యోగం సాధించి ఆ కంపెనీ ఆమోదంతో గ్రీన్‌కార్డుకు దరఖాస్తు చేసుకోవడం, ఒకవేళ గ్రీన్ కార్డ్ పెండింగ్‌లో ఉన్నంత కాలం హెచ్‌1బీ వీసా గడువును పెంచుకుంటూ ఉండటం... అమెరికాలోని భారతీయ ఉద్యోగులు పాటించే వరుస ఇదే. అధిక సంఖ్యలో భారతీయ నిపుణులు ఎంపికైనా కరోనా వైరస్‌ వారిలో ఆనందం లేకుండా చేసింది.

2021 ఆర్థిక సంవత్సరానికి అమెరికాలో హెచ్‌1బీ వీసా కింద ఎవరు ఎంపికయ్యారో అమెరికా పౌరసత్వం, విదేశీ సేవల విభాగం(యూఎస్‌ఐసీఎస్‌) తాజాగా వెల్లడించింది. ప్రస్తుత పరిస్థితుల్లో కంపెనీలు తమకు నౌకరీ ఇస్తాయో?లేదో? అన్న ఆందోళన వారిలో వ్యక్తమవుతోంది. హెచ్‌1బీ వీసా కోసం ప్రతి ఏడాది రిజిస్ట్రేషన్లు సంఖ్య పెరుగుతోంది. 2019 ఆర్ధిక సంవత్సరం కంటే 2020లో ఈసారి 74 వేల మంది అధికంగా పోటీపడ్డారు. మొత్తం 2.75 లక్షల దరఖాస్తులు అందటం గమనార్హం. వీటిలో 68 శాతం దరఖాస్తులు మన దేశం నుంచి రాగా, చైనా నుంచి మరో 13 శాతం దరఖాస్తులు అందాయి.

హెచ్‌1బీ వీసా కోసం మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు ఈ-రిజిస్ట్రేషన్‌ ద్వారా ఆయా ఎంప్లాయర్‌ నుంచి యూఎస్‌ఐసీఎస్‌ దరఖాస్తులు స్వీకరించింది. మొత్తం 85 వేల వీసాల్లో మొదట అందిన దరఖాస్తుల నుంచి జనరల్‌ కోటా కింద 65 వేల మందిని ఎంపిక చేశారు. ప్రతి ఏటా 70 శాతం వరకు ఈ వీసాలు మనవారికి దక్కుతున్నాయి. మాస్టర్‌ డిగ్రీ పూర్తి చేసిన వారి దరఖాస్తుల నుంచి మాస్టర్స్‌ కోటా కింద 20 వేల మందిని ఎంపిక చేశారు. ఈసారి లాటరీలో కొత్త పద్ధతిలో భారతీయ విద్యార్థులు అధిక సంఖ్యలో ఎంపికైనట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.

భారతీయులు దరఖాస్తు చేసినప్పుడు కరోనా ఉద్ధృతి అస్సలు లేదు. కరోనా వలన ప్రస్తుతం పరిస్థితి మారిపోవడంతో జూన్‌ 30వ తేదీ వరకు కంపెనీలు పూర్తి స్థాయి దరఖాస్తు సమర్పిస్తాయా?లేదా? అన్న సందిగ్ధత ఉందని వుందని ఓపి టీ సహ వ్యవస్థాపకురాలు జ్యోతి తెలిపారు.

అయితే ఆయా కంపెనీ దరఖాస్తు (పిటిషన్‌) దాఖలు చేస్తే దాదాపు హెచ్‌1బీ వచ్చినట్లే. జూన్‌ 30వ గడువు వుండటంతో ఆసక్తికరంగా మారింది. వీసా దక్కిన తర్వాత ఆ కంపెనీ చేర్చుకోకపోయినా... 2 నెలల లోపు ఏదో ఒక కన్సల్టెన్సీలో చేరే అవకాశం ఉందని ఓపీటీపై వర్క్ చేస్తూ హెచ్‌1బీ వీసాకి ఎంపికైన విద్యార్థి తెలిపారు. కరోనా ప్రభావం తగ్గిన తరువాత పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పలేం. మొత్తానికి భారతీయ విద్యార్థులు కలవరం పోవాలంటే వచ్చే జూన్ నెల వరకు ఆగాల్సిందే.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories