గాయకురాలి తండ్రిని కాల్చిచంపిన దుండగులు

గాయకురాలి తండ్రిని కాల్చిచంపిన దుండగులు
x
Highlights

పాకిస్తాన్ ప్రముఖ గాయకురాలు హనీఫ్ చమ్రోక్ తండ్రి, మానవ హక్కుల కార్యకర్తను కొందరు దుండగులు దారుణంగా కాల్చి చంపారు. ఈ సంఘటన పాకిస్తాన్లోని బలూచిస్తాన్...

పాకిస్తాన్ ప్రముఖ గాయకురాలు హనీఫ్ చమ్రోక్ తండ్రి, మానవ హక్కుల కార్యకర్తను కొందరు దుండగులు దారుణంగా కాల్చి చంపారు. ఈ సంఘటన పాకిస్తాన్లోని బలూచిస్తాన్ ప్రావిన్స్లో జరిగింది. మోటారుసైకిల్‌పై వెళుతున్న దుండగులు ఒక్కసారిగా ఆయనపై కాల్పులు జరిపి పరారయ్యారు.. ఆ సమయంలో హనీఫ్ చామ్రోక్ విద్యార్థుల బృందానికి బోధిస్తున్నారని ది డాన్ పత్రిక నివేదించింది.

దేశంలోని నైరుతి బలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని టర్బాట్ పట్టణంలో గురువారం ఈ సంఘటన జరిగింది. హనీఫ్ చమ్రోక్ తండ్రి తయాబా బలూచ్ ను కొందరు వ్యక్తులు లక్ష్యంగా చేసుకున్నారు. ఈ క్రమంలో దారుణంగా కాల్చిచంపారు. దీనిపై హనీఫ్ చమ్రోక్ తీవ్రంగా స్పందించారు. పాకిస్తాన్ భద్రతా దళాలపై విరుచుకుపడ్డారు, తన తండ్రి చంపుతారని ముందే సమాచారం ఇచ్చినా స్పందించకపోవడం దారుణమన్నారు.

ఈ ఘటనపై స్థానిక పోలీసు చీఫ్ రోషన్ అలీ మాట్లాడుతూ.. హత్యకు గల ఉద్దేశ్యం ఇంకా తెలియలేదని, ఇంతవరకూ ఎవరిని అరెస్ట్ చేయలేదని.. కాల్పుల తర్వాత దుండగులు అక్కడి నుంచి పారిపోయారని అన్నారు. కాగా ఉగ్రవాదులతో సంబంధాలున్నాయన్న అనుమానంతో బలూచిస్తాన్‌లో వారిని తరచూ అదుపులోకి తీసుకుంటారని చెప్పారు.

బలూచిస్తాన్ లో గత కొన్ని సంవత్సరాలుగా వేర్పాటువాద ఉద్యమాలు జరుగుతున్నాయి. ఈ ఉద్యమాలలో హనీఫ్ చమ్రోక్ కుటుంబం కూడా పాల్గొంటుందని భద్రతా దళాలు అనుమానిస్తున్నాయి. వేర్పాటువాదులు తరచూ బలూచిస్తాన్‌లో భద్రతా దళాలను లక్ష్యంగా చేసుకుంటున్నారని కూడా పోలీసులు గుర్తించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories