దేశం దాటేశాడు.. కైలాసమంటూ కొత్త దేశాన్ని సృష్టించాడు..!

దేశం దాటేశాడు.. కైలాసమంటూ కొత్త దేశాన్ని సృష్టించాడు..!
x
నిత్యానంద
Highlights

నిత్యానంద స్వామి అత్యాచార ఆరోపణలు ఎదుర్కొన్న వివాదస్పద స్వామీజీగా అందరికి గుర్తుకొస్తారు. ఈ స్వామీజీ ఎక్కడ ఉన్నారు.ఏం చేస్తున్నారో అన్నది ఆసక్తి నెలకొంది


నిత్యానంద స్వామి..అత్యాచార ఆరోపణలు ఎదుర్కొన్న వివాదస్పద స్వామీజీగా అందరికి టక్కున గుర్తొస్తాడు..అసలు ఈ స్వామీజీ ఎక్కడ ఉన్నారు...ఏం చేస్తున్నారో అన్నది ఆసక్తి నెలకొంది. నిత్యానిందపై రేప్ కేసు నమోదు అయిన తర్వాత కనిపించకుండా పోయారు. పరారీలో ఉన్న ఆయన కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తుండగానే కేసులకు భయపడి దేశం విడిచి పోయారు. అయితే ఏ దేశం వెళ్లి ఉంటారో అన్నదానిపై విపరీతంగా చర్చ కొనసాగింది. ఈ క్రమంలో నిత్యానంద గురించి ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. వెస్టీండిస్ దీవుల్లో ఈ విలక్ష స్వామి ప్రత్యక్షం అయ్యాడు. ఈక్వెడార్ సమీంలోని ఓ చిన్న దీపంలో తీష్ట వేసి హిందూ దేశంగా ప్రకటించుకున్నాడు నిత్యానంద.



బెంగళూరులో 2000 సంవత్సరంలో ఓ ఆశ్రమాన్ని స్థాపించి తన ప్రవచనాలతో ప్రజలను ఆకర్షించిన నిత్యానంద అసలు పేరు రాజశేఖరన్. 2010లో ఓ నటితో సన్నిహితంగా ఉన్న వీడియో బయటకు రావడంతో నిత్యానందుడి అసలు లీలలు బయటపడ్డాయి. ఆశ్రమం మాటున అసాంఘిక కార్యకలాపాలు జరుపుతున్నారంటూ నిత్యానందపై కేసు నమోదయ్యింది. అప్పట్లో జైలుకు వెళ్లి బెయిల్‌పై బయటకు వచ్చాడు. బెయిల్ గడువు పూర్తైనప్పటికీ పోలీసులకు లొంగిపోలేదు. నిత్యానంద కోసం పోలీసులు గాలించినప్పటికీ ఆచూకీ లభించలేదు. 2018లోనే దేశం విడిచి వెళ్లి పోయారు. నకిలీ పాస్‌పోర్ట్‌తో, నేపాల్‌ మీదుగా నిత్యానంద పారిపోయారు.



వెస్టీండీస్ దీవుల్లో ప్రత్యక్షమైన నిత్యానంద ఈక్వెడార్ నుండి ఒక చిన్న ద్వీపాన్ని కొనుగోలు చేసి దానికి కైలాస అనే పేరు పెట్టారు. తన ద్వీప దేశానికి ఒక పాస్ పోర్టు రూపొందించాడు. మెరూన్ కలర్ బ్యాక్ గ్రౌండ్ లో ఓ సింహాసనం ముందు నిత్యానంద కూర్చొని పక్క నంది చిత్రంతో జెండా. జాతీయ చిహ్నాన్ని డిజైన్ చేసుకున్నారు. అంతేకాదు కైలాస దేశం కోసం kailaasa.org పేరుతో వెబ్‌సైట్‌ను కూడా ఆవిష్కరించారు నిత్యానంద. కైలాస ఈ భూమండలంపై ఉన్న గొప్ప హిందూ దేశమని నిత్యానంద వెల్లడించారు.





నిత్యానంద ప్రభుత్వంలో పది శాఖలను ఏర్పాటు చేశాడు. విదేశీ వ్యవహారాలు, రక్షణ, సోషల్ మీడియా, హోం, కామర్స్, విద్యతో పాటు ఇతర శాఖలు ఉన్నాయి. తమ దేశంలో ఉచితంగా భోజనం, విద్య, వైద్యం లభిస్తాయని ఆధ్యాత్మిక విద్య, ప్రత్యామ్నాయ వైద్య విధానాలపై దృష్టి పెడుతున్నామంటూ ఆ వెబ్ సైట్లో వెల్లడించారు నిత్యానంద. కైలాస రాజకీయేతర హిందూ దేశమని హిందుత్వ పునరుద్దరణ కోసం కృషి చేస్తుందంటున్నారు. ప్రభుత్వాన్ని, ప్రధాన మంత్రిని, కేబినెట్‌ను ఏర్పాటు చేసుకున్న నిత్యానంద తన కైలాసకు ఒక దేశంగా గుర్తింపు ఇవ్వాలంటూ ఐక్యరాజ్యసమితికి విజ్ఞప్తి చేశారు. నిత్యానంద భవిష్యత్ కార్యాచరణపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.






Show Full Article
Print Article
More On
Next Story
More Stories