Coronavirus: ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభణ.. 1 మిలియన్ దాటేసింది

Coronavirus: ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభణ.. 1 మిలియన్ దాటేసింది
x
Highlights

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. కోవిడ్ భారిన పడిన వారి సంఖ్య 10 లక్షలకు చేరింది.

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. కోవిడ్ భారిన పడిన వారి సంఖ్య 10 లక్షలకు చేరింది.టలీ మరియు స్పెయిన్లలో మరణాల సంఖ్య పెరుగుతూనే ఉందని జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం తెలిపింది. ఈ వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా 51,000 మందికి పైగా మరణించారు, ఇటలీలో అత్యధిక మరణాలు సంభవించాయి, ఆ తరువాత స్థానంలో స్పెయిన్ మరియు యునైటెడ్ స్టేట్స్ ఉన్నాయని బాల్టిమోర్ విశ్వవిద్యాలయం యొక్క సెంటర్ ఫర్ సిస్టమ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ నివేదించింది.

ఇక 200,000 మందికి పైగా ప్రజలు ఈ వ్యాధి నుండి కోలుకున్నారని, వారిలో 75,000 మందికి పైగా చైనాలో ఉన్నారనీ.. వీరికి గత ఏడాది చివర్లో వైరస్ సోకిందని తెలిపింది. మరోవైపు అధికారిక రికార్డుల ఆధారంగా రాయిటర్స్ లెక్క ప్రకారం, మొదటి 100,000 కేసులు 55 రోజులలో మరియు మొదటి 500,000 లక్షల కేసులు 76 రోజులలో నమోదయ్యాయి. గత ఎనిమిది రోజుల్లో కేసులు 1 మిలియన్ల కు రెట్టింపు అయ్యాయని రాయిటర్స్ డేటా తెలిపింది.

కాగా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా వ్యాపించడంతో, వివిధ ప్రభుత్వాలు ఆయా ప్రాంతాల్లోని కర్మాగారాలు మరియు వ్యాపారాలను మూసివేసాయి, విమానయాన సంస్థలను గ్రౌండ్ చేశాయి.. అంతేకాదు అంటువ్యాధిని తగ్గించడానికి కోట్లాది మంది జనాన్ని ఇంటి వద్దే ఉండాలని వివిధ ప్రభుత్వాలు ఆదేశించాయి.

ఇదిలావుంటే కోవిడ్ - 19 ను ఎదుర్కొనేందుకు దేశ సన్నద్ధతపై మార్చి 25 నుంచి 30 మధ్య భారత ప్రభుత్వం సర్వే నిర్వహించింది. ఈ క్రమంలో దేశంలోని మొత్తం 410 జిల్లాల్లో సర్వే చేసింది. ఈ జిల్లాల్లో ఎక్కువగా వైరస్ కేసులు ఉన్నాయి. దీంతో దేశవ్యాప్తంగా పలు అంశాలపై సర్వే చేపట్టినట్టు తెలుస్తోంది. జిల్లా కలెక్టర్ల తోపాటు 2014 - 18 మధ్య ఐఏఎస్ అధికారులు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఈ సర్వే నిర్వహించినట్టు తెలుస్తోంది. ఐఏఎస్ లతో పాటు కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో సర్వే చేపట్టారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories