Coronavirus: ఆ నాలుగు దేశాల్లో పరిస్థితి ఘోరం

Coronavirus: ఆ నాలుగు దేశాల్లో పరిస్థితి ఘోరం
x
Highlights

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. మొత్తం 205 దేశాలకు వ్యాప్తిచెందిన ఈ మహమ్మారి ధాటికి ఇప్పటికే వేలాది మంది మరణించారు.

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. మొత్తం 205 దేశాలకు వ్యాప్తిచెందిన ఈ మహమ్మారి ధాటికి ఇప్పటికే వేలాది మంది మరణించారు. సోమవారం నాటికి ప్రపంచవ్యాప్తంగా 1.273.792 కేసులు నమోదవ్వగా.. ఇందులో 69.459 మంది మరణించారు.. అలాగే 264.761 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.

ఇంకా లక్షలాది మంది ఈ వ్యాధితో పోరాటం చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ కు మొత్తం 69,460 మంది మృత్యువాత పడ్డారు, ఇందులో ఎక్కువగా అమెరికా, ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్‌ల్లో దేశాల్లో ఉన్నారు. ఈ నాలుగు దేశాల్లోనే 48,000 మంది మరణించారు. అంతేకాదు ఈ నాలుగు దేశాల్లోనే దాదాపు 8 లక్షల మందికి వైరస్ సోకింది. అందునా అమెరికాలో అయితే 3 లక్షల వైరస్ కేసులు నమోదయ్యాయి.

న్యూయార్క్‌ రాష్ట్రంలోనే వైరస్ కరాళ నృత్యం చేస్తోంది. ఇక్కడ 24 గంటల వ్యవధిలో 630 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక ఇటలీ, స్పెయిన్, జర్మనీలోనూ కరోనా కేసులు లక్ష దాటాయి.. మరోవైపు ఫ్రాన్స్‌లో 603 మంది, బ్రిటన్‌లో 4,934 మంది, జర్మనీలో 1,584 మంది, బెల్జియంలో 1,447 మంది, నెదర్లాండ్‌లో 1,766, స్విట్జర్లాండ్ 715, టర్కీ 574, కెనాడా 284 మంది మృతిచెందారు.

కరోనా వైరస్‌కు కేంద్రమైన చైనాలో ఆదివారం మరో 39 కొత్త కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో ఆ దేశంలో మొత్తం కేసుల సంఖ్య 81,708కి చేరింది. అయితే మరణాల సంఖ్య ఇంకా అలాగే ఉంది. ఇదిలావుంటే దక్షిణ కొరియాలో వైరస్ తీవ్రత నిలకడగా ఉందని ఆ దేశ మీడియా పేర్కొంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories