అందరి అంచనాలను మించి పోరాడుతున్న ఉక్రెయిన్‌.. ఉక్రెయిన్‌కు భారీగా ఆయుధ సాయం

Germany Send Hundreds of Weapons and Missiles to Ukraine
x

అందరి అంచనాలను మించి పోరాడుతున్న ఉక్రెయిన్‌.. ఉక్రెయిన్‌కు భారీగా ఆయుధ సాయం

Highlights

Russia Ukraine War: ఉక్రెయిన్‌పై సైనిక చర్య చేపడుతున్నట్టు రష్యా ప్రకటించగానే కొన్ని గంటల్లో దేశాన్ని ఆక్రమిస్తుందని అందరూ అనుకున్నారు

Russia Ukraine War: ఉక్రెయిన్‌పై సైనిక చర్య చేపడుతున్నట్టు రష్యా ప్రకటించగానే కొన్ని గంటల్లో దేశాన్ని ఆక్రమిస్తుందని అందరూ అనుకున్నారు కానీ పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. నాలుగు రోజులుగా ఉక్రెయిన్‌ సైన్యం భీరకంగా పోరాడుతోంది. ఎక్కడికక్కడ రష్యా సైన్యాన్ని నిలువరిస్తోంది. ఇప్పుడు ఇదే ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది. భారీ విధ్వంసకర ఆయుధాలు, సైన్యమున్న రష్యా రెండో రోజే చర్చలకు పిలుపునివ్వడం అందరినీ ఆలోచనల్లో పడేసింది.

ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య ఈనెల 24న చేపట్టింది. మూడు దిక్కుల నుంచి దూసుకొస్తోంది. ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ స్వాధీనమైనట్టు రెండో రోజే ప్రకటించింది. ఇప్పటికీ రష్యా సైన్యం కీవ్‌ శివారుల్లోనే ఉంది. భూ, గగనతల దాడులకు రష్యా దిగుతున్నా ఉక్రెయిన్‌ సైన్యం ప్రతిఘటిస్తోంది. ఒక్క రోజులోనే పనైపోతుందని భావించిన రష్యాకు చుక్కలు చూపిస్తోంది. యాంటీ ట్యాంకులు, స్టింగర్‌ శ్రేణి క్షిపణలు, జావెలిన్‌ క్షిపణులతో రష్యా దాడులను తిప్పికొడుతోంది. నాలుగో రోజు కూడా రష్యాకు ఉక్రెయిన్‌ సమాధానమిస్తోంది. అందుకు కారణం వివిధ దేశాలు సరఫరా చేస్తున్న ఆయుధాలే.

ఉక్రెయిన్‌పై దాడికి దిగిన రష్యాపై పలు దేశాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. నేరుగా సైనిక సాయం చేయకపోయినప్పటికీ పలు దేశాలు ఆర్థిక, ఆయుధ సాయానికి ముందుకొచ్చాయి. తాజాగా జర్మనీ వెయ్యి యాంటీ ట్యాంకులు, 500 స్టింగర్‌ శ్రేణి క్షిపణులను సరఫరా చేసింది. బెల్జియం 2వేల మెషిన్‌ గన్నులను ఉక్రెయిన్‌కు తరలించింది. ఇక డచ్‌ ప్రభుత్వం స్నిప్పర్‌ రైఫిల్స్‌, 200 స్టింగర్‌ శ్రేణి క్షిపణులను పంపింది. అలాగే చెక్‌ రిపబ్లిక్‌ 30వేల తుపాకులు, 7వేల అసాల్ట్ రైఫిళ్లు, 3వేల మిషన్‌ గన్నులు, డజన్ల కొద్దీ స్నిప్పర్‌ గన్స్‌, పది లక్షల కార్ట్‌రిడ్జులను తరలించింది. ఇక అమెరికా 350 మిలియన్‌ డాలర్ల సాయయం ప్రకటించింది. ఇప్పటికే భారీ సంఖ్యలో జావెలిన్‌ క్షిపణులను తరలించింది.

ఈ ఆయుధాలతో ఉక్రెయిన్ సైన్యం నాలుగో రోజు కూడా పోరాట పటిమను ప్రదర్శించింది. యుద్ధం మరికొన్ని రోజులు జరిగే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికైనా యుద్ధాన్ని ఆపి శాంతికి కృషి చేయాలని పలు దేశాలు కోరుతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories