రైలులో భారి అగ్ని ప్రమాదం : 25 మంది ప్రయాణికులు మృతి

రైలులో భారి అగ్ని ప్రమాదం : 25 మంది ప్రయాణికులు మృతి
x
Highlights

లియాకత్‌పూర్ నగరానికి సమీపంలో గురువారం ఉదయం ఎక్స్‌ప్రెస్ రైలులో మంటలు చెలరేగడంతో 25 మంది ప్రయాణికులు మృతి చెందారు.

లియాకత్‌పూర్ నగరానికి సమీపంలో గురువారం ఉదయం ఎక్స్‌ప్రెస్ రైలులో మంటలు చెలరేగడంతో 25 మంది ప్రయాణికులు మృతి చెందగా, 13 మంది గాయపడ్డారు. తేజ్గామ్ రైలు కరాచీ నుండి రావల్పిండికి వెళుతుండగా, ప్రయాణికుల గ్యాస్ సిలిండర్ పేలి ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో కనీసం 25 మంది ప్రయాణికులు మరణించినట్లు జిల్లా పోలీసు అధికారి (డిపిఓ) సర్దార్ ముహమ్మద్ అమీర్ తైమౌర్ ఖాన్ ధృవీకరించారు.

గ్యాస్ సిలిండర్ పేలుడు కారణంగా మంటలు సంభవించాయని పాకిస్తాన్ రైల్వే అధికారులు ధృవీకరించారు. సిలిండర్ పేలిన కోచ్‌ను తలీఘీ జమాత్ బుక్ చేశారు. వారు అల్పాహారం చేసుకోవటానికి గ్యాస్ స్టవ్ మీద గుడ్లు ఉడకబెడుతుండగా ఈ పేలుడు సంభవించిందని. ఈ పేలుడుతో మంటలు మరో రెండు బోగీలను కూడా అంటుకున్నాయన్నారు.

ఫైర్ టెండర్లు, అత్యవసర బృందాలు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను చేపట్టాయి. మృతదేహాలను, గాయపడిన వారిని జిల్లా ప్రధాన కార్యాలయ ఆసుపత్రికి (డిహెచ్‌క్యూ) తరలించారు. మంటలను ఆర్పడానికి అగ్నిమాపక సిబ్బందిని నియమించారు. కాలిన భోగీలను రైలు నుంచి వేరు చేసినట్లు పిఆర్ అధికారి తెలిపారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories