సాయాన్ని తిరస్కరిస్తున్న పాకిస్థాన్‌.. వరదలతో నిండా మునిగిన ప్రజలు

Flood-ravaged Pakistan rejects Indias aid offer
x

సాయాన్ని తిరస్కరిస్తున్న పాకిస్థాన్‌.. వరదలతో నిండా మునిగిన ప్రజలు

Highlights

*సాయానికి ముందుకొచ్చిన భారత్‌.. సాయాన్ని తీసుకునేందుకు నిరాకరిస్తున్న పాక్‌

Pakistan: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న పాకిస్థాన్‌ను.. వరదలు ముంచెత్తి.. పరిస్థితులను మరింత దారుణంగా మార్చాయి. వరదలతో నిలువ నీడలేక.. ఉండడానికి ఇళ్లు లేక.. సర్వస్వం కోల్పోయిన పాక్‌ ప్రజలు.. రోడ్లపై తలదాచుకుంటున్నారు. వరద బాధిత ప్రజలకు కనీసం.. ఆహారాన్ని, తానునీటిని కూడా అందించలేని పరిస్థితిలో ఉన్నది షెహబాజ్‌ షరీఫ్‌ ప్రభుత్వం. పొరుగుదేశంలో ప్రజలు పడుతున్న కష్టాలకు స్పందించి.. భారత్‌ సాయానికి ముందుకొస్తే... ఇలాంటి సమయంలో కూడా పాక్‌ పాలకులు రాజకీయం చేస్తున్నారు. భారత్‌ సాయాన్ని అందుకోవడానికి విముకత వ్యక్తం చేస్తున్నారు. అష్టకష్టాలు పడుతున్న ప్రజలకు సాయాన్ని రాకుండా అడ్డుకుంటున్నారు. పాక్‌ వ్యవహార శైలిపై ఇప్పుడు అంతర్జాతీయంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

అప్పుల ఊబిలో కూరుకుపోయిన పాకిస్థాన్‌ను ఇటీవల వరదలు ముంచెత్తాయి. చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో భారీ వరదలు పాకిస్థాన్‌ను అతలాకుతలం చేశాయి. వరదల్లో మొత్తం 14 వందల 86 మంది చనిపోయారు. వారిలో 530 మంది చిన్నారులే ఉన్నట్టు పాకిస్థాన్‌ జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ తెలిపింది. వరదల కారణంగా లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. వర్షాలు, వరదలతో 3 కోట్ల 30 లక్షల మంది అవస్థలు పడ్డారు. ఇళ్లు, వాహనాలు, పశువులు, పంటలు కొట్టుకుపోయాయి. మొత్తం 3వేల కోట్ల డాలర్ల నష్టం వాటిల్లినట్టు షెహబాజ్‌ షరీఫ్‌ ప్రభుత్వం అంచనా వేస్తోంది. వరద బాధితులను ఆదుకోవడం దేవుడెరుగు.. కనీసం వారికి ఆహారాన్ని కూడా అందించలేని పరిస్థితి పాకిస్థాన్‌ది. ఈ పరిస్థితికి అక్కడి పాలకులు, ఆర్మీనే కారణం.. నిత్యం మతమౌఢ్యంతో.. ఉగ్రవాదాన్ని పెంచి పోషించేందుకే నిధులన్నీ ఖర్చు చేశారు. పాకిస్థాన్‌ అభివృద్ధి కన్నా.. పొరుగునున్న భారత్‌పై ఉగ్రవాదులను ఉసిగొల్పడానికే పాలకులు ప్రాధాన్యమిచ్చారు. వరదలు వస్తాయని తెలిసినా.. ఏమాత్రం ముందస్తు చర్యలు తీసుకోలేదు. ఫలితంగా.. సాగానికి పైగా పాకిస్థాన్ నీట మునిగింది.

పాకిస్థాన్‌లో ప్రజల పరిస్థితిని తెలుసుకున్న ఐక్య రాజ్యసమితి.. వరద బాధితులను ఆదుకునేందుకు 15 కోట్ల డాలర్ల సాయం అందించాలని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో భారత్‌, అమెరికా, కెనడా, బ్రిటన్‌, డెన్మార్క్‌ దేశాలు మాత్రం సాయానికి ముందుకొచ్చాయి. అయితే భారత్‌ నుంచి సాయాన్ని అందుకునేందుకు మాత్రం పాకిస్థాన్‌ నిరాకరిస్తోంది. ప్రజలను పట్టించుకోకుండా.. భారత్‌ను వ్యతిరేకించడమే పనిగా పెట్టుకుంది. దీనిపై షాంఘై సహకార సంస్థ-ఎస్‌సీవో సదస్సులోనూ ఈ అంశాన్ని భారత ప్రధాని మోడీ ప్రస్తావించారు. కష్టాల్లో ఉన్న ఎస్‌ఈవో సభ్యదేశాలకు సహకారం అందించేందుకు దారులు తెరవాలంటూ.. పరోక్షంగా పాకిస్థాన్‌ అంశాన్ని ప్రస్తావించారు. అప్ఘానిస్థాన్‌కు సహాయం అందించేందుకు పాక్‌ సహకరించాలని సూచించారు. పాకిస్థాన్‌ ప్రధాని నవాజ్ షరీఫ్ కూడా మధ్య ఆసియాకు కనెక్టివిటీని పెంచాలని కోరారు. అయితే భారత్‌ విషయాన్ని మాత్రం చర్చించ లేదు. ఈ సదస్సులో ప్రధాని మోడీతో కనీసం మర్యాదపూర్వకంగా కూడా షెహబాజ్‌ షరీఫ్‌ కలవలేదు. అయితే సాయం విషయంలో పాకిస్థాన్‌ విదేశాంగ మంత్రి బిలావల్‌ భుట్లో స్పందించారు. కశ్మీర్ అంశంలో భారత్‌తో చర్చించడం అత్యంత క్లిష్టమైనదిగా పేర్కొన్నారు. చర్చల విషయం పక్కన పెడితే కనీసం భారత్‌ నుంచి బియ్యం దిగుమతులను కూడా పాక్‌ అనుమతించడం లేదు.

తాజాగా భారత్‌ నుంచి దిగుమతులను అనుమతించాలంటూ పాకిస్థాన్‌లో డిమాండ్లు పెరుగుతున్నాయి. పత్తి, కూరగాయలు, పండ్లు, పప్పు దినుసులతో పాటు ఇతర నిత్యావసర దిగుమతులను అనుమతించాలని పాకిస్థాన్‌ ప్రభుత్వాన్ని కరాచీ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్ అండ్‌ ఇండస్ట్రీ-కేసీసీఐ కోరింది. భారత్‌-పాక్‌ సరిహద్దులోని వాగా నుంచి ఢిల్లీ వాహనాలను అనుమతించాలని డిమాండ్‌ చేసింది. దేశంలో నిత్యావసరాల కొరత వేధిస్తోందని.. ప్రజలు ఆకలితోనే చనిపోయేలా ఉన్నారని కేసీసీఐ ఆందోళన వ్యక్తం చేసింది. తక్కువ సమయంలో దిగుమతులకు భారతే మేలని.. ధరలు కూడా సరసంగానే ఉంటాయని పేర్కొంది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో భారత్‌ దిగుమతులతోనే ఆర్థిక పరిస్థితి నుంచి గట్టెక్కుతామని అక్కడి ఆర్థికవేత్తలు కూడా సూచిస్తున్నారు. ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవడం అంటే.. రవాణా చార్జీలు కూడా భారీగా పెరుగుతాయన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. కానీ.. పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ మాత్రం అందుకు సిద్ధపడడం లేదు. భారత్‌తో సంబంధాలకు ఏమాత్రం సిద్ధపడడం లేదు. సాయం చేస్తామన్న వద్దని తిరస్కరిస్తున్నారు. ఆపన్న హస్తం అందిస్తున్న చేతిని కొట్టడం పాకిస్థాన్‌ పాలకులకే చెల్లింది.

పాక్‌ అప్పులు తీవ్రమయ్యాయి. ఉక్రెయిన్ యుద్ధం తరువాత... లంకలో పూర్తిగా సంక్షోభం తలెత్తింది. లంకలో ప్రజలు తిరుగుబాటు చేశారు. అక్కడి పాలకులను దించేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పాయింది. కానీ.. పాకిస్థాన్‌లో కేవలం ప్రజలు మాత్రం తిరగబడలేదు. కానీ.. లంక కంటే ఘోరమైన పరిస్థితులు పాక్‌లో నెలకొన్నాయి. పాకిస్థాన్‌ 2022 జూన్‌ చివరి నాటికి పాకిస్థాన్‌ మొత్తం అప్పు.. 21వేల కోట్ల డాలర్లకు చేరింది. ఇందులో చైనా నుంచి తీసుకున్న అప్పులే 7వేల 730 కోట్ల డాలర్లను ఉన్నాయి. అందులో ఈ ఏడాది 12 వందల 50 కోట్ల డాలర్లు ఏడాది చివరిలోగా చెల్లించాల్సి ఉంది. పాకిస్థాన్‌ను కష్టాల నుంచి ఆదుకునేందుకు అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ-ఐఎంఎఫ్‌ ముందుకొచ్చింది. తాజాగా 11వందల కోట్ల డాలర్లను ఇచ్చేందుకు అంగీకరించింది. ప్రస్తుతం ఈ నిధులు ఏమాత్రం పాకిస్థాన్‌కు సరిపోవు. ఆకలితో నకనకలాడే వ్యక్తికి.. ముద్ద అన్నమే అందించినట్టుగా ఉంది. నిజానికి 520 కోట్ల డాలర్లను ఇవ్వాలంటూ ఐఎంఎఫ్‌ను పాకిస్థాన్‌ కోరింది. కానీ ఐఎంఎఫ్‌ మాత్రం ప్రస్తుతానికి అత్యవసరంగా 11 వందల కోట్ల డాలర్లను మాత్రమే అప్రూవ్‌ చేసింది. ఆ నిధులు అందినా.. పాకిస్థాన్‌కు కనీసం వరద ప్రాంతాల్లో పునరుద్ధరణ కూడా చేయడానికి సరిపడవు.

పాకిస్థాన్‌ మొదటి నుంచి కశ్మీర్‌పైనే పట్టుబడుతోంది. కశ్మీర్‌ను తమలో కలుపుకునేందుకే ఆరాటపడుతోంది. అందుకు ఉగ్రవాదాన్ని ఎగదోస్తోంది. ప్రజా సంక్షేమాన్ని ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. భారత్‌ సాయాన్ని తిరస్కరిస్తోందంటే.. ఆ దేశ పాలకులు ఎంత నీచంగా వ్యవహరిస్తున్నారో ఇట్టే అర్థమవుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories