చెవులు కొరుక్కుంటూ పుకార్లు పుట్టించారో...చెత్త ఎత్తాల్సిందే!

చెవులు కొరుక్కుంటూ పుకార్లు పుట్టించారో...చెత్త ఎత్తాల్సిందే!
x
Highlights

మీకు గాసిప్స్‌ వినాలంటే ఆసక్తా.. అయితే కొంచెం ఓకే. కానీ గాసిప్స్‌ క్రియేట్‌ చేయడమంటే సరదానా ఇలా అయితే కాస్త ఆలోచించాల్సిందే. తొందరపడి ఏదైనా లేని విషయం...

మీకు గాసిప్స్‌ వినాలంటే ఆసక్తా.. అయితే కొంచెం ఓకే. కానీ గాసిప్స్‌ క్రియేట్‌ చేయడమంటే సరదానా ఇలా అయితే కాస్త ఆలోచించాల్సిందే. తొందరపడి ఏదైనా లేని విషయం ఉన్నట్టుగా ఆనోటా ఈనోటా పడేలా చేశారో ముచ్చటగా మూడు గంటలు ఆడుతూపాడుతూ నడి వీధిలో చెత్త ఎత్తాల్సిందే. ఈ శిక్ష అనుభవించాల్సిందే. ఇదెక్కడి గోల అనుకుంటున్నారా..? ఆ చెత్త-గాసిప్స్‌ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.

చెత్తకీ.. గాసిప్స్‌కి ఓ అవినాభావ సంబంధం ఉంది ఇదేంటబ్బా అని ఆశ్చర్యపోతున్నారా. ఒకరిద్దరు కలిసి చెవులు కొరుక్కుంటూ పుకార్లు పుట్టించారో, లేదా సోషల్‌ మీడియాలో గాసిప్స్‌ క్రియేట్‌ చేశారో అంతే సంగతులు. అందుకు ఫైన్‌ కట్టాల్సిందే చెత్త కూడా ఎత్తాల్సిందే. ఇదంతా ఫిలిప్పిన్స్‌లోని ఓ పట్టణంలో కండీషన్‌.

పుకార్లు బుల్లెట్‌ కన్నా వేగంగా షికారు చేస్తుంటాయి. వాస్తవం కన్నా ముందే బట్వాడా అయిపోతాయి. అసలు నిజం బయటపడేవరకు హల్‌చల్‌ చేస్తాయి. కొందరికి పుకార్లు వినోదాత్మకంగా కనిపించినా మరికొందరిని ఇబ్బందులకు గురిచేస్తాయి. ఒకప్పుడు ఇద్దరు కలిసి చెవులుకొరుక్కుంటే పుట్టిన పుకార్లు ఒక ప్రాంతానికే పరిమితమయ్యేవి. ఇప్పుడు వార్తలు, సోషల్‌మీడియా అంటూ విస్తృతంగా చక్కర్లు కొడుతున్నాయి. వాటిని అరికట్టడం కష్టసాధ్యం. కానీ ఆ దిశగా ఫిలిప్పిన్‌లోని ఓ పట్టణం అడుగులేసింది.

ఫిలిప్పీన్స్‌ రాజధాని మనీలాకి 200 కిలో మీటర్ల దూరంలో ఉన్న చిన్న పట్టణం బినలొనన్‌. గతంలో అక్కడ విపరీతంగా పుకార్లు సృష్టించేవారట. దీంతో వీటిని ఎలాగైన అరికట్టాలని భావించిన స్థానిక ప్రభుత్వం ఏకంగా పుకార్లను నిషేధిస్తూ ఓ చట్టం తీసుకొచ్చింది. ఇకపై ఈ పట్టణంలో ఎవరైనా పుకార్లు సృష్టించినా వాటిని ప్రచారం చేసినా నేరంలా పరిగణిస్తామని ప్రజలను హెచ్చరించింది. ఈ చట్టం ప్రకారం మొదటిసారి పుకార్లు సృష్టించి పట్టుబడ్డ వ్యక్తికి తక్కువ మొత్తంలో అంటే భారత కరెన్సీలో 264 రూపాయల జరిమానా విధిస్తారు. అంతే కాదు తప్పనిసరిగా మూడు గంటల పాటు వీధుల్లో చెత్త సేకరించేలా శిక్ష విధిస్తారు.

ఇక ఒక్కటి కంటే ఎక్కువ సార్లు పుకార్లు పుట్టిస్తూ పట్టుబడితే 20 డాలర్లు జరిమానా విధించి 8 గంటలు సమాజ సేవ చేసేలా చూస్తారట. నిజానికి ఈ చట్టాన్ని 2017లోనే మొరెనో ప్రాంతంలో అమలు చేశారు. పుకార్లు సృష్టిస్తున్న వారికి 10 డాలర్లు జరిమానా విధించేవాళ్లు. మధ్యాహ్నం వేళ చెత్తను సేకరించేలా శిక్ష విధించారు. దీనికి మంచి ఫలితాలు వచ్చాయి. జరిమానా పడ్డవాళ్లు మళ్లీ పుకార్లు సృష్టంచడానికి, ప్రచారం చేయడానికి పూనుకోలేదు. దీంతో ఆ చట్టాన్ని బినలొనన్‌ వ్యాప్తంగా అమలు చేస్తున్నారు. ఈ చట్టమేదో మన దగ్గర కూడా చేస్తే బాగుండు. పక్కన వాళ్ల గురించి లేనిపోనివి మాట్లాడుకోవడం మానేసి ఎవరి పని వాళ్లు చేసుకుంటారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories