సంచలన నిర్ణయం ప్రకటించిన బ్రిటన్ ప్రభుత్వం

England Lift Covid Rules
x

సంచలన నిర్ణయం ప్రకటించిన బ్రిటన్ ప్రభుత్వం

Highlights

England Lift Covid Rules: బ్రిటన్​ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.

England Lift Covid Rules: బ్రిటన్​ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఓవైపు ప్రపంచ దేశాలను ఒమిక్రాన్​ వణికిస్తుంటే యూకేలో కొవిడ్​ ఆంక్షలను మొత్తం ఎత్తివేసినట్లు ప్రకటించారు ప్రధాని బోరిస్​ జాన్సన్​. దేశంలో కొవిడ్​-19 ఆంక్షలను మొత్తం ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు. ఇంగ్లాండ్​లో మాస్క్​ తప్పనిసరికాదు నిబంధన సహా ఇతర కొవిడ్​ ఆంక్షలన్నింటికీ ముగింపు పలుకుతున్నట్లు ఆయన ప్రకటించారు.

కరోనా కొత్త వేరియంట్​ ఒమిక్రాన్​..గరిష్ఠస్థాయికి చేరి, తగ్గుముఖం పట్టినట్లు శాస్త్రవేత్తలు చెప్పారని బోరిస్​ తెలిపారు. ఒమిక్రాన్​ నుంచి బయటపడిన తొలి దేశం తమదే అన్నారు. ఈ నేపథ్యంలో ఇక ఉద్యోగులకు వర్క్​ ఫ్రం హోం సదుపాయం కూడా ఉండదని స్పష్టం చేశారు. ఒమిక్రాన్​ పీక్​ దశను అధిగమించిందని దేశ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రపంచ దేశాల్లో వ్యాక్సిన్​ను మొట్టమొదట అందించింది యూకేనే అని ప్రధాని బోరిస్ ప్రకటించారు.

వేసవిలో చాలా మంది వ్యతిరేకించినా దేశంలో కఠిన ఆంక్షలు విధించినట్లు గుర్తుచేశారు బోరిస్​. ఇప్పుడు ఇతర దేశాల్లో లాక్​డౌన్​ ఉన్నా..తాము అన్ని కార్యకలాపాలు కొనసాగిస్తున్నామన్నారు. అందుకే జీ-7 దేశాల్లో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా బ్రిటన్​ అవతరించిందని ప్రధాని బోరిస్ తెలిపారు. యూకేలో మొత్తం 5 కోట్ల 20 లక్షల మందికిపైగా టీకా తొలి డోసును పొందగా 4 కోట్ల 79 లక్షలకుపైగా టీకా రెండు డోసులను తీసుకున్నట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. 3 కోట్ల 65 లక్షల మంది బూస్టర్​ డోసును కూడా తీసుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories