ట్విట్టర్ డీల్ ను పక్కన పెట్టిన ఎలాన్ మస్క్.. కుప్పకూలిన ట్విట్టర్ షేర్లు..

Elon Musk Puts Twitter Deal On Hold
x

ట్విట్టర్ డీల్ ను పక్కన పెట్టిన ఎలాన్ మస్క్.. కుప్పకూలిన ట్విట్టర్ షేర్లు..

Highlights

Twitter Deal On Hold: ట్విట్టర్ కు అమెరికా కుబేరుడు ఎలాన్ మస్క్ షాకిచ్చారు.

Twitter Deal On Hold: ట్విట్టర్ కు అమెరికా కుబేరుడు ఎలాన్ మస్క్ షాకిచ్చారు. ట్విట్టర్ ను కొనుగోలు చేయాలనుకున్న డీల్ ను తాత్కాలికంగా పక్కన పెట్టారు. ఈ విషయాన్ని ఆయన ట్వీట్ చేశారు. స్పామ్, ఫేక్ అకౌంట్లకు సంబంధించిన వివరాలు ఇంకా పెండింగ్ లో ఉన్నాయన్నారు. అందుకే డీల్ ను హోల్డ్ లో పెడుతున్నానని ఎలాన్ మస్క్ తెలిపారు.

మొత్తం అకౌంట్లలో వీటి సంఖ్య 5 శాతం కంటే తక్కువగానే ఉంటుందని ట్విట్టర్ చెపుతోంది. అయితే ఈ లెక్క తేల్చాలని, పక్కా వివరాలను అందించాలన్నది మస్క్ డిమాండ్. ఈ వివరాలు అందేంత వరకు డీల్ ను హోల్డ్ లో ఉంచుతున్నట్టు ఆయన చెప్పారు. మస్క్ ఈ ప్రకటన చేసిన వెంటనే ట్విట్టర్ షేర్ల విలువ ఏకంగా 20 శాతం పడిపోయింది. 44 బిలియన్ డాలర్లతో ట్విట్టర్ ను మస్క్ కొనుగోలు చేయాలనుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories