Trump Tariffs: ఇక కంప్యూటర్ కొనాలంటే వాచిపోద్ది.. ట్రంప్‌ భారీ షాక్‌!

Trump Tariffs: ఇక కంప్యూటర్ కొనాలంటే వాచిపోద్ది.. ట్రంప్‌ భారీ షాక్‌!
x
Highlights

summary: అమెరికా-చైనా మధ్య కొనసాగుతున్న వాణిజ్య యుద్ధంలో తాజా టారిఫ్ నిర్ణయం ఎలక్ట్రానిక్స్ రంగాన్ని గట్టిగా తాకనుంది. ఇప్పటివరకు మినహాయింపులు ఇచ్చిన ఎలక్ట్రానిక్ వస్తువులపై కూడా అమెరికా తాజాగా టారిఫ్ విధించనుంది.

అమెరికా-చైనా టారిఫ్ యుద్ధం మరో మలుపు తిరిగింది. ఇంతవరకు టారిఫ్ ల నుంచి మినహాయింపు పొందిన ఎలక్ట్రానిక్స్ వస్తువులపై కూడా ఇప్పుడు స్పెషల్ టారిఫ్‌లు విధించనున్నట్టు అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవర్డ్ ల్యూట్నిక్ తెలిపారు. స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాపులు, కంప్యూటర్లు, సెమికండక్టర్‌లపై మరో నెల రోజుల్లో ప్రత్యేక టారిఫ్‌లు అమలులోకి వస్తాయని ఆయన చెప్పారు.

ఇదంతా ట్రంప్ ప్రభుత్వం గత వారం ప్రకటించిన మినహాయింపులను తిరిగి ఉపసంహరించుకున్నట్టే. అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ చైనా దిగుమతులపై 125 శాతం రికిప్రోకల్ టారిఫ్‌లు విధిస్తున్నప్పటికీ, ముఖ్యమైన ఎలక్ట్రానిక్ వస్తువులపై మినహాయింపును ప్రకటించింది. దీని వలన యాపిల్ వంటి దిగుమతులపై ఆధారపడి ఉన్న టెక్ కంపెనీలకు పెద్ద ఊరట లభించింది.

ఈ మినహాయింపు వల్ల వినియోగదారులకు ధరల భారాన్ని తగ్గించేందుకు, ద్రవ్యోల్బణ ప్రభావాన్ని తగ్గించేందుకు అవకాశం ఏర్పడింది. అయితే, ఈ రిలీఫ్ తాత్కాలికమేనన్న సూచనలు అప్పుడే వెలుగుచూశాయి. ఇప్పుడు, మరోసారి ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ప్రత్యేక టారిఫ్‌లతో తిరిగి ముందుకు వస్తుండటంతో టెక్ పరిశ్రమలో ఉత్కంఠ మొదలైంది. ప్రత్యేకంగా సెమికండక్టర్ పరిశ్రమను టార్గెట్ చేస్తూ కొత్త టారిఫ్‌లు తీసుకురావాలని ట్రంప్ ప్రభుత్వం భావిస్తోంది. కానీ ఇప్పటికీ టారిఫ్ రేట్లు ఖరారు కాలేదు. ఇప్పటి వరకు కొన్ని సెక్టార్లపై 25 శాతం టారిఫ్ అమలులో ఉంది. కానీ ఎలక్ట్రానిక్స్ వస్తువులు, చిప్స్‌పై రాబోయే టారిఫ్ శాతం ఎంత ఉండబోతుందన్నది ఇప్పటికీ క్లారిటీ లేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories