Coronavirus: చైనాలో క్రమంగా తగ్గుతున్న కరోనావైరస్ ప్రభావం

Coronavirus: చైనాలో క్రమంగా తగ్గుతున్న  కరోనావైరస్ ప్రభావం
x
Highlights

చైనాలో కరోనావైరస్ మరణాలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. గతంలో రోజుకు 200 దాకా మరణాలు సంభవించాయి.. కానీ సోమవారం నాటికి అది 100 కి పడిపోయింది. అయితే...

చైనాలో కరోనావైరస్ మరణాలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. గతంలో రోజుకు 200 దాకా మరణాలు సంభవించాయి.. కానీ సోమవారం నాటికి అది 100 కి పడిపోయింది. అయితే వ్యాప్తికి కేంద్రంగా ఉన్న హుబీ ప్రావిన్స్‌లో మాత్రం ఫిబ్రవరి 16న 1,933 కొత్త కేసులు నమోదయ్యాయి.. మునుపటి రోజులతో పోలిస్తే కొత్త కేసుల సంఖ్య దాదాపు 5 శాతం పెరిగింది, అలాగే 100 కొత్త మరణాలను నివేదించారు ఆరోగ్య అధికారులు. ప్రస్తుతం చైనాలో మొత్తం 1,700 మందికి పైగా మరణించారని తేల్చారు. మొత్తంగా గతంతో పోల్చుకుంటే మరణాల సంఖ్య పడిపోయిందని తెలిపారు.

మరోవైపు చైనాలో అన్ని ప్రాంతాల్లో కాకుండా కేవలం రెండు మూడు ప్రాంతాల్లోనే కరోనావైరస్ కేసులు నమోదవుతున్నాయని.. కొత్త కేసులలో దాదాపు 90 శాతం హుబే ప్రావిన్స్‌ ప్రాంతీయ రాజధాని వుహాన్ లో ఉన్నాయి.. ఇప్పటివరకు నిర్ధారిత కేసుల సంఖ్య 68,500కు పెరగగా, వాటిలో 56,249 కేసులు హుబే ప్రావిన్స్‌లోనివే అని దీన్ని బట్టి చూస్తుంటే వైరస్ వ్యాప్తి తగ్గుతున్నట్టు కనిపిస్తోందని పేర్కొన్నారు. కాగా ఈ ప్రాంతంలో 11 మిలియన్ల మంది ప్రజలు నివాసం ఉంటున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories