అణుబాంబు వేస్తే షాంపూ వాడొద్దా.. అమెరికా హెచ్చరికలో అంతరార్థం ఏంటి..?

Dont use Conditioner on Your Hair in Event of Nuclear War
x

అణుబాంబు వేస్తే షాంపూ వాడొద్దా.. అమెరికా హెచ్చరికలో అంతరార్థం ఏంటి..? 

Highlights

Shampoo: షాంపూ.. సాధారణంగా వెంట్రకల సంరక్షణ కోసం వాడుతుంటాం.

Shampoo: షాంపూ.. సాధారణంగా వెంట్రకల సంరక్షణ కోసం వాడుతుంటాం. బలహీనంగా ఉన్న శిరోజాలను కాస్త యాక్టీవ్‌గా మార్చేందుకు షాంపూలను ఉపయోగిస్తాం. అలాగే కండీషనర్లు కూడా వెంట్రుకలకు కొత్త ఎనర్జీ ఇచ్చేందుకు సహాయపడతాయి. ప్రస్తుత రోజుల్లో షాంపూ అండ్ కండీషనర్.. కామన్‌ అందరూ ఉపయోగించేవే. కానీ అమెరికా మాత్రం వాటిని వాడొద్దంటూ ఓ స్టేట్‌మెంట్‌ ఇచ్చింది. అణుయుద్ధం జరిగితే షాంపూ, కండీషనర్లకు దూరంగా ఉండాలని సూచిస్తోంది. మరి వాటిని ఎందుకు ఉపయోగించకూడదు..? అణుయుద్ధానికి షాంపూ, కండీషనర్లకు మధ్య సంబంధం ఏంటి..?

రెండు రోజుల క్రితం రష్యా అధ్యక్షుడు పుతిన్ సెన్షేషనల్ కామెంట్స్ చేశాడు. ఏకంగా అణ్వస్త్ర హెచ్చరికను జారీ చేశాడు. దేశ సార్వభౌమాధికారానికి ముప్పు తేవాలని చూస్తే అణుయుద్ధానికి వెనుకాడబోమని వార్నింగ్ ఇచ్చాడు. తమదగ్గరున్న ఆయుధాలనన్నీ వాడుతామన్నారు. తనవి ఒట్టిమాటలు కావని దేశ రక్షణ కోసం అవకాశం ఉన్నంత మేర అన్ని శక్తులూ వినియోగిస్తామన్నారు. దేశాన్ని, ప్రజలను రక్షించుకోడానికి అణ్వాయుధాలను ఉపయోగిస్తామన్నారు. దీంతో అటు యూరప్ దేశాలు, ఇటు అగ్రరాజ్యం అమెరికా ఉలిక్కి పడింది. రష్యా నుంచి ఇలాంటి ప్రకటన వస్తుందని అనుకోలేదు.

వాస్తవానికి అణుయుద్ధమంటే అందరికీ తెలిసింది హిరోషీమా, నాగసాకి మాత్రమే. ఆ తర్వాత ఈ భూమిపై అంతటి ఘోరమైన పరిస్థితి రాలేదు. కానీ పుతిన్ వార్నింగ్‌తో మరోసారి అలాంటి యుద్ధమే వస్తే..? రష్యా ఉక్రెయిన్‌పై అణుబాంబులు వేస్తే ఏంటి పరిస్థితి..? ఈ ప్రశ్నలెలా ఉన్నా అగ్రరాజ్యం అమెరికా మాత్రం ఓ సంచలన స్టేట్‌మెంట్‌ రిలీజ్ చేసింది. అణుయుద్ధం వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తమ పౌరులకు సూచిస్తూ ప్రకటన విడుదల చేసింది.

పుతిన్ స్టేట్‌మెంట్‌ ఇచ్చినప్పుడు అంత హైప్ క్రియేట్ కాలేదు కానీ ఆ తర్వాత అమెరికా చేసిన ప్రకటన మాత్రం యావత్ ప్రపంచాన్ని భయంలో నెట్టేసింది. అణుయుద్ధం జరిగినప్పుడు ఏం చేయాలి..? ఏం చేయకూడదనే జాబితా డూస్ అండ్ డోన్ట్ డూస్ అనే లిస్ట్‌ను తమ దేశ పౌరుల కోసం అమెరికా పబ్లిక్ హెల్త్ ఏజెన్సీ ఓ అడ్వైజరీ జారీ చేసింది. అందులో ముఖ్యంగా జుట్టుకు షాంపూలు, కండీషనర్ లను ఉపయోగించొద్దని స్పష్టం చేసింది. అవి ప్రాణాంతకమని రేడియేషన్ సమయంలో ఉపయోగిస్తే దీర్ఘకాలికంగా చాలా అపాయమని తేల్చిచెప్పింది.

వాస్తవానికి షాంపూ కానీ, కండీషనర్‌ కానీ వెంట్రుకలకు సరికొత్త శక్తినిస్తాయి. శిరోజాలకు షైనింగ్ ఇస్తాయి. బలహీనంగా ఉన్న వెంట్రుకల్లో తాజాదనం నింపుతాయి. యాక్టీవ్‌గా కనిపించేలా అవి పనిచేస్తాయి. కానీ అణు విస్ఫోటనం జరిగినప్పుడు మాత్రం వీటిని అస్సలు ఉపయోగించరాదని వైద్యులు సూచిస్తున్నారు. రేడియోధార్మికత పదార్థాల మధ్య ఈ షాంపూ లేదా కండీషనర్ జిగురుగా పనిచేస్తాయని చెబుతున్నారు. విస్ఫోటనం జరగ్గానే రేడియోధార్మిక ధూళి కణాలు క్షణాల్లోనే గాల్లో కలిసిపోతాయి. మెల్లిమెల్లిగా అవి విస్తరిస్తాయి. అదే సమయంలో మన తలకు షాంపూ నురగ లేదా కండీషనర్‌ ఉంటే ఆ రేడియోధార్మిక కణాలను ఆకర్షిస్తాయి. దీంతో ఆ విషపూరిత కణాలు వెంట్రుకల మధ్య ఏళ్ల తరబడి ఉండిపోతాయి. ఈ కణాలు సాధారణంగా మనిషి లోపల ఉన్న కణాలను దెబ్బతీస్తాయి.

ఒక్కసారి అలాంటి రేడియోధార్మిక కణాలు మన ఒంటిపై పడితే వాటి ప్రభావం ఏళ్లకు ఏళ్లు ఉంటాయి. క్రమంగా మనిషి లోపలి కణాలను దెబ్బతీస్తాయి. దీర్ఘకాలిక వ్యాధులకు గురిచేస్తాయి. శారీరక, మానసిక రుగ్మతలకు దారి తీస్తాయి. క్యాన్సర్ కు కారకాలుగా మారుతాయి. దీంతో అణుబాంబులు పడే సమయంలో షాంపూలు, కండీషనర్ల వంటి వాటికి వీలైనంత దూరంగా ఉండాలని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సూచించింది. అంతేకాకుండా అణువిస్పోటనం జరిగినపుడు మురికి దుస్తులను తొలగించాలని ఆ వెంటనే స్నానం చేయాలని కూడా సూచించింది. ఇటుక లేదా కాంక్రీట్‌తో కట్టిన భవనాల్లో ఆశ్రయం పొందాలని సిఫార్సు చేసింది. కళ్లు, ముక్కు, నోటికి ఇతర వస్తువులేవీ తాకకుండా చూసుకోవాలని సూచించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories