వైట్ హౌస్ ముందు నిరసనలు : బంకర్ లోకి దూరేసిన ట్రంప్

వైట్ హౌస్ ముందు నిరసనలు : బంకర్ లోకి దూరేసిన ట్రంప్
x
Highlights

నల్లజాతీయుడు జార్జి ఫ్లాయిడ్‌ మృతిపై అమెరికాలో జనాగ్రహం పెల్లుబికింది. మిన్నియాపోలిస్‌లో జార్జ్ ఫ్లాయిడ్ అనే న‌ల్ల‌జాతీయ వ్యక్తిని ఓ శ్వేత‌జాతి పోలీసు...

నల్లజాతీయుడు జార్జి ఫ్లాయిడ్‌ మృతిపై అమెరికాలో జనాగ్రహం పెల్లుబికింది. మిన్నియాపోలిస్‌లో జార్జ్ ఫ్లాయిడ్ అనే న‌ల్ల‌జాతీయ వ్యక్తిని ఓ శ్వేత‌జాతి పోలీసు గొంతు నొక్కి చంపిన విష‌యం తెలిసిందే. మార్చి 25వ తేదీ నుంచి అమెరికా దేశ‌వ్యాప్తంగా హింసాత్మ‌క ఆందోళ‌న‌లు చోటుచేసుకుంటున్న విష‌యం తెలిసిందే.

అధ్యక్ష్యభవనం వైట్ హౌస్ బయట పెద్దఎత్తున ఆందోళన కారులు గుమిగూడడంతో ముందు జాగ్రత్తగా ట్రంప్ ను సీక్రెట్ బంకర్ లోకి అమెరికా సీక్రెట్ సర్వీస్ అధికారులు తరలించారు. పోలీసులతో ఆందోళనకారులు బాహాబాహీకి దిగడంతో పాటు షాప్‌లు, ఆఫీస్‌లు, వాహనాలకు నిప్పు పెట్టిరు. శ్వేత సౌధం అధికారులు ఆయన్ను బంకర్ లోకి తరలించారని, దాదాపు గంట పాటు ఆయన అక్కడే ఉన్నారని, సీక్రెట్ సర్వీస్, యూఎస్ పార్క్ పోలీసు అధికారులు నిరసనకారులను నిలువరించిన తరువాత ట్రంప్ మరలా బయటకు వచ్చారని 'న్యూయార్క్ టైమ్స్' పత్రిక పేర్కొంది.


HMTV లైవ్ వార్తలు ఎప్పటికప్పుడు గూగుల్ న్యూస్ లో చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి

Show Full Article
Print Article
Next Story
More Stories