Donald Trump: ఈ నెల 15 న పెద్ద ప్రకటన చేయబోతున్నా...

Donald Trump Says Hell Make Very Big Announcement Next Week
x

Donald Trump: ఈ నెల 15 న పెద్ద ప్రకటన చేయబోతున్నా...

Highlights

Donald Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి రానున్నారా..?

Donald Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి రానున్నారా..? వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారా..? ట్రంప్ చేసిన ఓ ప్రకటనతో ఈ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వచ్చే వారం తాను కీలక ప్రకటన చేయబోతున్నట్లు ట్రంప్ స్వయంగా ప్రకటించారు. అయితే అది ఎన్నికల్లో పోటీ చేస్తారనే ప్రకటనే అయి ఉండొచ్చనే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.

అమెరికా మధ్యంతర ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒహైయోలో పర్యటించిన ట్రంప్ ఈ నెల 15 న ఫ్లోరిడాలో చాలా పెద్ద ప్రకటన చేయబోతున్నట్లు ప్రకటించారు. మూడోసారి అధ్యక్ష ఎన్నికల్లో పోటీపై ట్రంప్‌ ఆసక్తిగా ఉన్నట్లు గత కొంత కాలంగా వార్తలు వినిపిస్తున్న క్రమంలో తాజా ప్రకటన ఆసక్తికరంగా మారింది. దీంతో త్వరలోనే ట్రంప్ ఎన్నికల ప్రచారం ప్రారంభించే అవకాశం ఉందని ఆ దేశ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. అయితే మధ్యంతర ఎన్నికల ఫలితాల తర్వాతే ప్రకటన చేయాలని ట్రంప్‌కు కొందరు రిపబ్లికన్ నేతలు సూచిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories