Donald Trump: ట్రంప్ అల్టిమేటం.. గాజా యుద్ధం ముగింపుపై హమాస్‌కు చివరి హెచ్చరిక!

Donald Trump Issues Final Warning to Hamas Over Ceasefire and Hostage Release Deal
x

Donald Trump: ట్రంప్ అల్టిమేటం.. గాజా యుద్ధం ముగింపుపై హమాస్‌కు చివరి హెచ్చరిక!

Highlights

Donald Trump Issues Final Warning to Hamas Over Ceasefire and Hostage Release Deal

Donald Trump: హమాస్‌కి అమెరికా అధ్యక్షుడు ట్రంస్ హెచ్చరిక చేశారు. ఇజ్రాయెల్ కాల్పుల విరమణ, బందీల విడుదల ప్రతిపాదనను అంగీకరించిందని ట్రంప్ ట్రూత్ ద్వారా వెల్లడించారు. గాజా యుద్ధాన్ని ముగించడానికి తమ షరతులను అంగీకరించాలని హమాస్‌కు చివరి హెచ్చరిక చేశారు. ఇజ్రాయెల్ ప్రజలు తమ నిబంధనలను అంగీకరించారని తెలిపారు. హమాస్ కూడా అంగీకరించాల్సిన సమయం ఆసన్నమైందని.. అంగీకరించకపోతే తీవ్ర పరిణామాలను ఎరుర్కొంటుందని.. ఇది తన చివరి హెచ్చరిక అటూ ట్రంప్ హెచ్చరించారు.

కానీ ఇజ్రాయెల్ ప్రణాళిక ప్రకారం కాల్పుల విరమణ ఒప్పందం మొదటి రోజు బందీలందరినీ విడుదల చేయాలి. ఈ తరువాత విస్తృత చర్చలు జరపాలని యోచిస్తోంది. దానికి బదులుగా ఇజ్రాయెల్ పాలస్తీనియన్ ఖైదీలను విడుదల చేయాలి. చర్చలు కొనసాగుతున్నంత కాలం కాల్పుల విరమణ కొనసాగుతుందని.. ట్రంప్ ప్రత్యేక్ష పర్యవేక్షణలో చర్చలు జరుగుతాయని టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ వెల్లడించింది. బందీలు, తప్పిపోయిన కుటుంబాల ఫోరం ఇజ్రాయెల్ కాల్పుల విరమణకి ఒప్పందానికి మద్దతు ఇవ్వాలని కోరింది.

Show Full Article
Print Article
Next Story
More Stories