Donald Trump Fires on China: చైనాపై కోపం పెరుగుతుంది: అమెరికా అధ్యక్షుడు ట్రంప్

Donald Trump Fires on China: చైనాపై కోపం పెరుగుతుంది: అమెరికా అధ్యక్షుడు ట్రంప్
x
Highlights

Donald Trump Fires on China: కరోనావైరస్ వ్యాప్తిపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.

Donald Trump Fires on China: కరోనావైరస్ వ్యాప్తిపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికాలో కరోనాతో పెరుగుతున్న మరణ మృదంగం చూసి తీవ్ర అగ్రహంతో ట్రంప్ ఊగిపోతున్నారు. కరోనా పురిటిగడ్డ చైనాపై మరింత కోపంగా ఉన్నానని ఆయన పేర్కొన్నారు. కొవిడ్ 19 పూర్తిగా నియంత్రణ చెయ్యలేమని అన్నారు.

రోజు రోజుకూ దారుణంగా పరిస్థితులు మారటాన్ని తాను చూస్తున్నానని ట్రంప్ పేర్కొన్నారు. చైనా వైరస్ యుఎస్ఎకు చేసిన భారీ నష్టంతో తాను చైనాపై మరింత కోపంగా ఉన్నానని ట్రంప్ ట్వీట్ చేశారు.

ఇప్పటికే ట్రంప్ చైనా విషయంలో తీసుకుంటున్న నిర్ణయాలతో.. కొనసాగుతున్న వాణిజ్య యుద్ధంపై ఇప్పటికే రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇక అమెరికాలో కరోనా వ్యాప్తిని కంట్రోల్ కోసం ఎంతగా ప్రయత్నం చేసినా.. కేసులు మాత్రం ఘోరంగా పెరుగుతున్నాయని , ఇప్పటికే అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నారని, మహమ్మారిని అణిచివేసేందుకు అధికారులకు ప్రజలు సహకారం తోడైతే మరిన్ని చర్యలు తీసుకోవచ్చని వివరించారు. అగ్రరాజ్యం లో కేసులు రోజుకు రెట్టింపు అవుతున్నాయి..రోజుకు దాదాపు 100,000 కు పైగా ఉండవచ్చని అధికారులు హెచ్చరించారు.

కరోనా నియంత్రణ కష్టమని అమెరికా‌ వైద్యులు ట్రంప్‌కు తెలిపారు. ఇక దీంతో తీవ్ర అసహనంలో ఉన్న ట్రంప్ చైనాపై తన కోపం అంతకంతకూ పెరుగుతోందనీ అంటున్నారు. అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వైరస్‌ పగబట్టింది. తాజాగా అక్కడ కేసుల సంఖ్య 7 లక్షలు దాటింది. అమెరికాలో కొవిడ్‌ 19 వ్యాప్తి చెందుతోంది. ఇప్పటికే ప్రపంచంలో ఎక్కడా నమోదుకానన్ని కేసులు, అత్యధిక మరణలతో అమెరికా సతమతమవుతోంది.. ఇకపై పెను సవాలును ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. శుక్రవారం అర్థరాత్రి వరకు అక్కడ నమోదైన కేసుల సంఖ్య 7,06,309కి చేరింది. మృతుల సంఖ్య 36,607గా నమోదైంది. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 58,478కి చేరింది. గడిచిన 24 గంటల్లో ఆ దేశంలో 3,856 మంది మృతిచెందారు.

Show Full Article
Print Article
Next Story
More Stories