Donald Trump: చైనా దిగుమతులపై 100 శాతం అదనపు సుంకాలు

Donald Trump
x

Donald Trump: చైనా దిగుమతులపై 100 శాతం అదనపు సుంకాలు

Highlights

Donald Trump: చైనాపై అమెరికా మరోసారి ఆర్థిక దెబ్బ కొట్టింది. చైనా నుంచి అమెరికాకు వస్తున్న ఉత్పత్తులపై 100 శాతం సుంకాలు (టారిఫ్‌లు) విధించినట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.

Donald Trump: చైనాపై అమెరికా మరోసారి ఆర్థిక దెబ్బ కొట్టింది. చైనా నుంచి అమెరికాకు వస్తున్న ఉత్పత్తులపై 100 శాతం సుంకాలు (టారిఫ్‌లు) విధించినట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. చైనా అరుదైన ఖనిజాల ఎగుమతులపై ఆంక్షలు పెట్టడమే దీనికి కారణమని ఆయన స్పష్టం చేశారు.

ట్రంప్ మాట్లాడుతూ, “చైనా అందరికీ శత్రువుగా మారుతోంది. అవసరం అయితే జిన్‌పింగ్‌తో జరగాల్సిన భేటీని రద్దు చేస్తాం. చైనాపై మరిన్ని సుంకాలు కూడా విధించేందుకు సిద్ధంగా ఉన్నాం” అని హెచ్చరించారు.

ఇప్పటికే అమెరికా–చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం మరింత చర్చనీయాంశమైంది. ట్రంప్ వ్యాఖ్యలతో మార్కెట్లు కూడా ప్రభావితం అయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories