China: కరోనా సోకకుండా జాగ్రత్తలు పాటించాలి: వైద్యుల హెచ్చరిక

China: కరోనా సోకకుండా జాగ్రత్తలు పాటించాలి: వైద్యుల హెచ్చరిక
x
Highlights

గత వారం రోజులుగా కరోనా వైరస్ ప్రపంచాన్నే గడగడ లాడిస్తుంది. ఇప్పటి వరకూ ఏ వైరస్ వ్యాప్తి చెందనంత వేగంగా ఆ వైరస్ వ్యాప్తి చెందుతుందని.

గత వారం రోజులుగా కరోనా వైరస్ ప్రపంచాన్నే గడగడ లాడిస్తుంది. ఇప్పటి వరకూ ఏ వైరస్ వ్యాప్తి చెందనంత వేగంగా ఆ వైరస్ వ్యాప్తి చెందుతుందని. ఇప్పటి వరకూ ఈ వైరస్ కారణంగా చైనాలో 41 మంది చనిపోగా, 1200పైగా కేసులు నమోదయ్యాయని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. కాగా వీరిలో దాదాపు 250 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉందని స్పష్టం చేసారు. కాగా సరిగ్గా 17 ఏళ్ల క్రితం ఇదే విధంగా చైనా, హాంకాంగ్‌లో సార్స్ వైరస్ వ్యాప్తి చెందిందని, ఆ వైరస్ కు చెందిన పోలికలు కూడా కరోనా వైరస్ ను పోలి ఉన్నాయని అక్కడి వైద్యులు తెలిపారు. ఈ వైరస్ కారణంగా 774 మంది ప్రాణాలు కోల్పోయారు. వైద్య నిపుణులు తెలిపారు.

ఇక పోతే 17 ఏళ్ల క్రితం వ్యాప్తి చెందిన సార్స్ వైరస్, మెర్స్ వైరస్ గబ్బిలాల వల్ల వ్యాప్తి చెందిందని వైద్యులు తెలిపారు. ఇప్పుడు ఇదే కోణంలో కరోనా వైరస్ కూడా వ్యాప్తి చెందుతుందని అన్నారు. ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకి చనిపోయిన 41 మందిలో 66 శాతం మంది సముద్ర ఆహార మార్కెట్‌లో పనిచేసినవారే కావడంతో ఈ వైరస్ జంతువుల నుంచి, క్షీరదాల నుంచి వ్యాప్తి చెందుతుందని వైద్యులు ప్రాథమికంగా నిర్దారించారు.

ఇక చైనాలో కరోనా వైరస్ బారిన పడి చనిపోయిన మొదటి వ్యక్తి వుహాన్ చేపల మార్కెట్‌లోనే పనిచేశాడని, అతను వారం రోజుల నుంచి జలుబుతో, జ్వరంతో బాధపడ్డాడని, తరువాత నిమోనియా సోకడంతో ఊపిరితిత్తులు సరిగ్గా పనిచేయక శ్వాసకోష వ్యాధితో బాధపడ్డాడని తెలిపారు. దీంతో అతని కుటుండ సభ్యులు అతన్ని ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మృతి చెందారని వైద్యలు నిర్ధారించారు. అతని భార్య కూడా దాదాపుగా అవే లక్షణాలతో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతుందని వైద్యులు తెలిపారు.

ఇక చైనాలో ఎక్కువగా వ్యాప్తి చెందుతున్న ఈ కరోనా వైరస్ భారతదేశంలో వ్యాపిస్తుందా, లేదా అనే విషయాన్ని నిర్ధారించలేమని, ఇప్పటి వరకు దేశంలో కరోనా వైరస్ కేసులు ఏమీ నమోదు కాలేదని వైద్యాధికారులు తెలిపారు. ఈ వ్యాధి సోకకుండా ప్రజలు ముందు గానే జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉంటూ, పరిశుభ్రత పాటించాలని కోరారు. ఈ వ్యాధి ఎక్కువగా తుమ్ములు, దగ్గుల ద్వారా వ్యాప్తి చెందుతుంది కాబట్టి ప్రజలు మాస్క్ లు ధరించాలని తెలిపారు. చేతులు ఎప్పటి కప్పుడు శుభ్రం చేసుకోవాలని తెలిపారు. గాలి ద్వారా ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాప్తి చెందుతుంది కాబట్టి ఈ వైరస్ శ్వాసవ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందని తెలిపారు.

ఇక పోతే తొలిసారిగా 1960లో ఇలాంటి వైరస్ లను ఎన్నింటినో గుర్తించారని, ఇప్పటివరకూ వీటిలో కేవలం ఆరు రకాలు వైరస్‌లు మాత్రమే మనుషులపై ప్రభావం చూపించాయని అన్నారు. మిగతా వైరస్ లు ఎక్కువగా పక్షులు, క్షీరదాల్లో ప్రభావం చూపించేవని స్పష్టం చేసారు. ఇక ఇదే కోణంలో 2012లో సౌదీ ఆరేబియాలో మిడిల్ ఈస్ట్ రెస్పిరెటరీ సిండ్రోమ్ అనే వైరస్ వ్యాప్తి చెందిందని, దీని కారణంగా ప్రపంచవ్యాప్తంగా 850 మంది మృత్యు ఒడికి చేరుకున్నారని తెలిపారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories