చైనాలో తగ్గుముఖం పడుతున్న కరోనా

చైనాలో తగ్గుముఖం పడుతున్న కరోనా
x
కరోనా వైరస్
Highlights

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. చైనాలో మొదలైన ఈ వైరస్ ఇప్పటికే యాబై దేశాలకి పైగా వ్యాపించింది. ఈ వైరస్...

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. చైనాలో మొదలైన ఈ వైరస్ ఇప్పటికే యాబై దేశాలకి పైగా వ్యాపించింది. ఈ వైరస్ కారణంగా ఇప్పటికే చైనాలో 3000 మందికి పైగా మరణించగా, ప్రపంచ వ్యాప్తంగా 90,000 మందికి పైగా చనిపోయారు.

ప్రస్తుతం చైనాలో కరోనా వైరస్ ప్రభావం తగ్గుముఖం పడుతోంది. గతంతో పోలిస్తే అక్కడ కొత్తగా నమోదవుతున్న కేసుల సంఖ్య తగ్గుతోంది. కొవిడ్-19 వ్యాప్తిపై అక్కడి జాతీయ ఆరోగ్య కమిషన్ సమీక్ష నిర్వహించింది. కొవిడ్-19 వ్యాధి నుంచి కోలుకున్న వారు మరోసారి దీని బారిన పడే అవకాశం ఉందా అనే విషయంపై అక్కడి అధికారులు చర్చించినట్టు తెలిసింది.

కొవిడ్ నుంచి కోలుకున్న వారు కూడా మరోసారి వ్యాధి బారినపడే అవకాశం ఉందని చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ భావిస్తున్నట్టు తెలిసింది. కోవిడ్ 19 వైరస్ నుంచి కోలుకున్న వారి శరీరాల్లో యాంటీబాడీస్ తయారైనప్పటికీ.. అవి ఎక్కువ రోజులు శరీరంలో కొనసాగలేవని చైనా వైద్యులు చెబుతున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories