పాక్ మాజీ అధ్యక్షుడు ముషారఫ్‌కు లాహోర్ కోర్టులో ఉరట

పాక్ మాజీ అధ్యక్షుడు ముషారఫ్‌కు లాహోర్ కోర్టులో ఉరట
x
పర్వేజ్‌ ముషారఫ్‌ ఫైల్ ఫోటో
Highlights

పాకిస్థాన్‌లో పెషావర్ హైకోర్టు గత సంవత్సరం మాజీ అధ్యక్షుడు ముషారఫ్‌కు మరణశిక్ష విధిస్తూ సంచలన తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే.

పాకిస్థాన్‌లో పెషావర్ హైకోర్టు గత సంవత్సరం మాజీ అధ్యక్షుడు ముషారఫ్‌కు మరణశిక్ష విధిస్తూ సంచలన తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్‌ ముషారఫ్‌కు ప్రత్యేక కోర్టు విధించిన ఉరిశిక్షను లాహోర్ కోర్టు కొట్టేసింది. మరణశిక్ష తీర్పును సవాలు చేస్తూ ముషారఫ్ తరపు న్యాయవాది వేసిన పిటిషన్ లాహోర్ హైకోర్టు చెందిన ముగ్గరు న్యాయమూర్తుల ధర్మాసనం విచారించింది. పర్వేజ్‌ ముషారఫ్‌కు కేసు విచారణ నిమిత్తం ఏర్పాటైన ప్రత్యేక న్యాయస్థానం చట్టవిరుద్ధమని హైకోర్టు పేర్కొంది. ముషారఫ్ పై నమోదు చేసిన దేశద్రోహం కేసు నిబందనల ప్రకారం లేదని కోర్టు వ్యాఖ్యానించింది. ఇప్పుడు ముషారఫ్ కు ఎటువంటి శిక్ష లేదని ఆయన తరపు న్యాయవాది తెలిపారు.

2007లో అప్పటి అధ్యక్షుడిగా ఉన్న ముషారఫ్ పాకిస్తాన్ ఎమర్జెన్సీని ప్రకటించారు. ఆదేశ సుప్రీంకోర్టు న్యాయమూర్తులపై గృహ నిర్భందం విధించారు. దీంతో ప్రజలు నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత ఎదురైంది. ఈ క్రమంలో 2013 డిసెంబర్ లో పర్వేజ్‌ ముషారఫ్‌పై దేశద్రోహం కేసు నమోదైంది. అప్పటి నుంచి ఆరేళ్లపాటు విచారణ జరిగింది. డిసెంబర్ 17న ముషారఫ్ కు మరణ శిక్ష విధిస్తూ సంచలన తీర్పు ఇచ్చింది.

ముషారఫ్‌ 1999 నుంచి 2008 వరకు పాకిస్తాన్‌ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించాడు. అయితే రాజ్యాంగాన్నికి వ్యతిరేంగా 2007నవంబర్‌3న దేశంలో ఎమర్జెనీ విధించినందుకు ఆయనపై 2013లో దేశద్రోహం కేసు నమోదైంది. దేశ ద్రోహం కేసులో ముషారఫ్‌కు మరణశిక్ష విధిస్తూ ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించింది. ప్రస్తుతం ముషారఫ్‌ విదేశాల్లో తలదాచుకుంటున్నాడు. మూడేళ్ల క్రితం పాకిస్థాన్ వదిలి దుబాయ్ వెళ్లిన ముషారఫ్ ప్రస్తుతం అక్కడే తల దాచుకున్నారు. అయితే ఆయన ఆస్తులను జప్తు చేయాలని కోర్టు తీర్పు ఇచ్చింది. రెండు దశాబ్దాల క్రితం పాకిస్థాన్ ఆర్మీ చీఫ్‌గా ఉన్న ముషారఫ్ సైనిక పాలన ద్వారా అధ్యక్ష పదవిని చేజిక్కించుకున్నారు. పర్వేజ్‌ ముషారఫ్‌కు మరణశిక్ష విధించడంపై లహోర్ హైకోర్టులో సవాల్ చేశారు. లాహోర్ హైకోర్టు మరణ రద్దు చేస్తూ తీర్పునిచ్చింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories