Breaking news : పాకిస్థాన్ లో ఘోర ప్రమాదం.. రైలు, బస్సు ఢీ..

Breaking news : పాకిస్థాన్ లో ఘోర ప్రమాదం.. రైలు, బస్సు ఢీ..
x
Highlights

పాకిస్థాన్ లో ఘోర ప్రమాదం జరిగింది ఎక్స్‌ప్రెస్ రైలు.. బస్సును ఢీకొనడంతో 20 మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. నైరుతి పాకిస్తాన్ కరాచీ నుండి 500...

పాకిస్థాన్ లో ఘోర ప్రమాదం జరిగింది ఎక్స్‌ప్రెస్ రైలు.. బస్సును ఢీకొనడంతో 20 మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. నైరుతి పాకిస్తాన్ కరాచీ నుండి 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న సుక్కూర్ జిల్లాలోని కంధ్రా పట్టణంలో ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో అక్కడికక్కడే 20 మంది మంది మృతి చెందగా, డజన్ల కొద్దీ గాయపడ్డారని కంధ్రా కమిషనర్ షఫీక్ మహేసర్ తెలిపారు.

ఈ ప్రమాదంలో మహిళలు, పిల్లలు కూడా మరణించినట్లు షఫీక్ మహేసర్ తెలిపారు. క్షతగాత్రులను తాలూకా హాస్పిటల్ రోహ్రీ, సివిల్ హాస్పిటల్ సుక్కూర్ కు తరలించినట్టు చెప్పారు. పాకిస్తాన్ ఎక్స్‌ప్రెస్ రైలు కరాచీ నుండి రావల్పిండికి వెళుతుండగా రైల్వే క్రాసింగ్ వద్ద బస్సును ఢీకొట్టింది.. దీంతో ఈ ఘోర ప్రమాదం జరిగింది.

గాయపడిన వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నందున మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ప్రమాదంపై సమాచారం తెలుసుకున్న పాకిస్థాన్ జాతీయ రైల్వే మంత్రి షేక్ రషీద్ అహ్మద్ విచారం వ్యక్తం చేశారు. సహాయక చర్యలు ముమ్మరం చెయ్యాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ఇక ఈ ఘటనపై పాకిస్తాన్ రైల్వే ప్రతినిధి మాట్లాడుతూ.. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు అనిపించిందని చెప్పారు.

మానవరహిత లెవల్ క్రాసింగ్ వద్ద సిబ్బంది లేకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని.. పాకిస్తాన్ రైల్వేలో 2,470 మంది మానవరహిత స్థాయి క్రాసింగ్ ల వద్ద సిబ్బంది లేరని.. వారిని నియమించుకోవలసిందిగా గతంలో ప్రాంతీయ ప్రభుత్వాలకు లేఖ రాసినట్లు ఆయన చెప్పారు.

కాగా రైలు ప్రమాదాల విషయంలో పాకిస్తాన్‌కు సుదీర్ఘ చరిత్ర ఉంది, మౌలిక సదుపాయాలు సరిగా లేకపోవడం మరియు భద్రతా ప్రమాణాలు లేకపోవడం ఇందుకు కారణాలుగా ఉన్నాయి. గత ఏడాది పాకిస్తాన్ కేంద్ర పట్టణం అయిన రహీమ్ యార్ ఖాన్ సమీపంలో గూడ్స్ రైలును ప్యాసింజర్ రైలు ఢీకొనడంతో 23 మంది మరణించారు మరియు 72 మందికి పైగా గాయపడ్డారు. తాజాగా ఈ ఘటన జరగడంతో 20 మరణించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories