Pakistan: కరాచీలో విషపూరిత వాయువు లీక్.. పలువురు మృతి

Pakistan: కరాచీలో విషపూరిత వాయువు లీక్.. పలువురు మృతి
x
Highlights

పాకిస్తాన్ ఓడరేవు నగరమైన కరాచీలో కూరగాయల కంటైనర్ నుండి వెలువడే విష వాయువులను పీల్చుకుని ఏడుగురు మరణించారు.. అలాగే 150 మంది దాకా పైగా ఆసుపత్రి...

పాకిస్తాన్ ఓడరేవు నగరమైన కరాచీలో కూరగాయల కంటైనర్ నుండి వెలువడే విష వాయువులను పీల్చుకుని ఏడుగురు మరణించారు.. అలాగే 150 మంది దాకా పైగా ఆసుపత్రి పాలయ్యారు. కేమరి ఓడరేవు ప్రాంతంలోని కార్గో షిప్ నుంచి ఆదివారం రాత్రి కంటైనర్ ను దించుతుండగా దానిలోనుంచి ఒక్కసారిగా విషపు పొగలు వచ్చాయి. దాంతో సమీపంలోని ప్రజలు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డారు.. ఈ విషపు వాయువు పీల్చి అక్కడికక్కడే నలుగురు మృతిచెందారు. ఆసుపత్రిలో ఆదివారం రాత్రి మరోక వ్యక్తి మరణించారు. 15 మందికి పైగా స్పృహ కోల్పోయారని ప్రాథమిక దర్యాప్తులో తేలింది.. అని డిఐజి షార్జీల్ ఖరాల్ విలేకరులతో అన్నారు.

వారిని సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే సోమవారం రాత్రి మరో ఇద్దరు మరణించినట్టు తెలిపారు. ఓడరేవు అధికారులు, నావికాదళం నుంచి పోలీసులు కార్గో షిప్ వివరాలను కోరినట్లు షార్జీల్ ఖరాల్ తెలిపారు . దాదాపు 150 మంది దాకా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండటంతో చికిత్స పొందుతున్నారు.. వారిలో కొందరికి వాంతులు, విరేచనాలు అయ్యాయి. ఈ సంఘటన పై ఆరాతీసిన మంత్రి సయ్యద్ మురాద్ అలీ షా.. ఘటన జరిగిన ప్రాంతం నుండి నివాసితులను వేరే ప్రాంతానికి తరలించాలని ఆదేశించారు. మంత్రి ఇంట్లో సోమవారం రాత్రి సమావేశమైన అత్యవసర సమావేశంలో బాధితులకు అందుతున్న వైద్య సహాయంపై చర్చించారు.

కరాచీలోని కీమారి ప్రాంతంలో లీక్ అయిన టాక్సిక్ గ్యాస్ పీల్చి మొత్తం ఏడుగురు మరణించారు, దీని స్వభావం ఏమిటో నిర్ధారించలేదని పోలీసులు తెలిపారు. శ్వాసకోశ సమస్యతో బాధపడుతున్న మొత్తం 150 మందిని వైద్య చికిత్స కోసం క్లిఫ్టన్‌లోని జియావుద్దీన్ ఆసుపత్రికి, ఇతర ఆసుపత్రులకు తరలించారు. సోమవారం మృతిచెందిన వారిలో ఒకరు ఇమ్రాన్ అష్రాఫ్ (30) గా గుర్తించగా, మరొకరికి 50 ఏళ్ల వ్యక్తిగా గుర్తించారు. మరోవైపు ఈ ఘటనపై పాక్ ప్రధానికి సమాచారం అందింది. దాంతో వైద్యసహాయంపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తూనే ఉంది ప్రధాని కార్యాలయం.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories