Top
logo

Dawood Ibrahim Love Story: పాక్ న‌టితో దావూద్ ఇబ్ర‌హీం ప్రేమాయణం

Dawood Ibrahim Love Story: పాక్ న‌టితో దావూద్ ఇబ్ర‌హీం ప్రేమాయణం
X

Dawood Ibrahim Love Story

Highlights

Dawood Ibrahim Love Story: ముంబయి వరుస పేలుళ్ల ప్రధాన నిందితుడు, అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్‌లో ఓ సినీన‌టితో ప్రేమాయ‌ణం న‌డుపుతున్న‌ట్టుగా తెలుస్తోంది.

Dawood Ibrahim Love Story: ముంబయి వరుస పేలుళ్ల ప్రధాన నిందితుడు, అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్‌లో ఓ సినీన‌టితో ప్రేమాయ‌ణం న‌డుపుతున్న‌ట్టుగా తెలుస్తోంది. భారతదేశం నుంచి పారిపోయిన దావూద్ పాకిస్థాన్ దేశంలోని కరాచీ నగరంలోని ఓ బంగ్లాలో నివాసముంటున్నారు. గ‌త మూడేళ్లుగా పాక్ న‌టి మోహ్విష్ హయత్‌తో ప్రేమాయాణం నడుపుతున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.

దావూద్‌తో సంబంధం వల్లనే పాక్ నటి మెహ్విష్‌కు 2019లో పాక్ పౌర పురస్కారమైన 'తమ్గా ఇంతియాజ్' లభించిందని సమాచారం.కొన్నేళ్ల క్రితం వరకు అంతగా తెలియని సినీనటి మెహ్విష్ హయత్‌కు పాక్ పురస్కారం లభించడంతో పాక్ చిత్ర పరిశ్రమ షాక్‌కు గురైంది.ఐటం గర్ల్ గా తన సినీ కెరీర్ ప్రారంభించిన మెహ్విష్ దావూద్ ఇబ్రహీం దృష్టిని ఆకర్షించిందని, దావూద్ తో సంబంధాల వల్లనే ఆమెకు పలు పెద్ద సినిమాల్లో అవకాశాలు లభించాయని సమాచారం. అంతేకాకుండా దావూద్ ప్రేయ‌సిగా చ‌లామ‌ణి అవుతూ ప‌లు పార్టీలను కూడా నిర్వ‌హిస్తోందట.

గతంలో ముంబై నగరంలో దావూద్ నివాసమున్నపుడు కూడా బాలీవుడ్ సినీనటులతో సన్నిహిత సంబంధాలుండేవి. అప్పట్లో దావూద్ పలు బాలీవుడ్ సినిమాల్లోనూ పెట్టుబడులు పెట్టాడు. పలువురు బాలీవుడ్ నటులు దావూద్ ఇంట్లో జరిగిన విందులకు సైతం హాజరయ్యారు.

Web TitleDawood Ibrahim relationship with Pakistani actress Mehwish Hayat
Next Story