Dawood Ibrahim: అండర్‌ వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీంపై విషప్రయోగం

Dawood Ibrahim Poisoned Admitted In Hospital Claims Social Media
x

Dawood Ibrahim: అండర్‌ వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీంపై విషప్రయోగం

Highlights

Dawood Ibrahim: గత ఆదివారమే దావూద్‌పై విషప్రయోగం జరిగినట్లు సమాచారం

Dawood Ibrahim: పరారీలో ఉన్న అండర్‌వరల్డ్‌ డాన్‌, ముంబయి బాంబు పేలుళ్ల సూత్రధారి దావూద్‌ ఇబ్రహీం తీవ్ర అనారోగ్యంతో కరాచీలోని ఓ ఆస్పత్రిలో చేరినట్లు ప్రచారం జరుగుతోంది. దావూద్‌పై విషప్రయోగం జరిగినట్లు ప్రచారం వార్తలు వెలువడుతున్నాయి. భారీ భద్రత నడుమ దావూద్‌కు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. రెండ్రోజుల క్రితమే దావూద్‌ను ఆస్పత్రిలో చేర్చినట్లు ప్రచారం జరుగుతోంది.

కరాచీలోని ఓ ఆస్పత్రిలో ఫ్లోర్‌ మొత్తం ఖాళీ చేసి కేవలం దావూద్‌ ఒక్కడినే ఉంచి చికిత్స తెలుస్తోంది. కేవలం వైద్యులు, కుటుంబ సభ్యులను మాత్రమే ఆ అంతస్తుకు అనుమతిస్తున్నాట్లు సమాచారం. అయితే పాకిస్తాన్ ప్రభుత్వం కాని, మీడియా గాని దావూద్‌ అంశంపై ఎలాంటి వార్తలను వెలువరించలేదు. వీటిపై దావూద్‌ సమీప బంధువుల నుంచి సమాచారం సేకరించేందుకు ముంబయి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. 1993లో ముంబయిలో జరిగిన భీకర పేలుళ్ల తర్వాత దావూద్‌ ఇబ్రహీం పాకిస్థాన్‌కు పారిపోయాడు. అయితే, అతడు తమ దేశంలోనే ఉన్నట్లు పాక్‌ ఇంతవరకూ అంగీకరించలేదు.

కానీ, దావూద్‌ కరాచీలోనే ఉన్నాడని అతడి సోదరి హసీనా పార్కర్‌ కుమారుడు అలీషా పార్కర్‌ చెప్పినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ ఈ ఏడాది జనవరిలో దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌లో పేర్కొంది. అంతేగాక, దావూద్‌ ముఠా కరాచీ ఎయిర్‌పోర్టును నియంత్రిస్తున్నట్లు ఎన్‌ఐఏ వెల్లడించింది. దావూద్‌ రెండో పెళ్లి కూడా చేసుకున్నట్లు సదరు ఛార్జ్‌షీట్‌లో పేర్కొంది. ఇప్పటికే దావూద్‌ను ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. 2018లో ఐక్యరాజ్యసమితి విడుదల చేసిన అంతర్జాతీయ ఉగ్ర సంస్థలు, ఉగ్రవాదుల జాబితాలో దావూద్‌ పేరు కరాచీ అడ్రసుతో ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories