CRPF jawan: పాకిస్తానీ మహిళతో వివాహం.. CRPF జవాన్‌పై వేటు!

CRPF jawan
x

CRPF jawan: పాకిస్తానీ మహిళతో వివాహం.. CRPF జవాన్‌పై వేటు!

Highlights

CRPF jawan: జాతీయ భద్రతకు సంబంధించిన సున్నితమైన వ్యవహారాల్లో జవానులు పూర్తి పారదర్శకతతో వ్యవహరించాలని కోరుతున్నారు.

CRPF jawan: ఒక పాకిస్తాన్ మహిళతో వివాహం చేసుకున్న విషయాన్ని దాచినందుకు, ఆమె వీసా గడువు ముగిసిన తర్వాత కూడా భారత్‌లో నివాసం ఉండేందుకు, సహాయం చేసినందుకు సీఆర్‌పీఎఫ్ జవాను మునీర్ అహ్మద్‌ను విధుల నుంచి వెంటనే తొలగించారు. జాతీయ భద్రతా కారణాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

మునీర్ అహ్మద్ జమ్మూకశ్మీర్‌లో విధులు నిర్వర్తిస్తున్న సమయంలో పాకిస్తాన్ పంజాబ్‌కు చెందిన మినాల్ ఖాన్ అనే యువతితో ఆన్‌లైన్‌లో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ఆన్‌లైన్ నికాహ్‌కు దారి తీసింది. మినాల్ ఖాన్ 2025 మార్చిలో భారత్‌కు వచ్చింది. ఆమెకు ఇచ్చిన షార్ట్‌టెర్మ్ వీసా మార్చి 22న ముగిసినా, ఆమె తిరిగి వెళ్లలేదు. ఆమె తరఫు న్యాయవాది చెబుతున్నట్లయితే, ఆమె లాంగ్‌టెర్మ్ వీసా కోసం అప్పటికే దరఖాస్తు చేసుకున్నది.

పహల్గాం ఉగ్రదాడి అనంతరం, భారత్ పాక్ పౌరుల వీసాలు రద్దు చేసిన సమయంలో మినాల్‌కు కూడా దేశం విడిచిపెట్టాలన్న నోటీసు అందింది. ఆమె వాస్తవంగా అట్టారి-వాఘా సరిహద్దుకు చేరుకున్నప్పుడే, కోర్టు నుంచి తాత్కాలిక ఉపశమనం లభించింది. అయినప్పటికీ, ఆమె భర్తగా ఉన్న మునీర్ అహ్మద్ తన ఉద్యోగ నియమ నిబంధనలను ఉల్లంఘించినట్టు గుర్తించిన సీఆర్‌పీఎఫ్, చట్టపరమైన వివరాల పరిశీలన అనంతరం అతన్ని విధుల నుంచి తొలగించింది.

ఈ వ్యవహారంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. జాతీయ భద్రతకు సంబంధించిన సున్నితమైన వ్యవహారాల్లో జవానులు పూర్తి పారదర్శకతతో వ్యవహరించాలని కోరుతున్నారు. ఈ ఘటన ఇతర జవానులకు హెచ్చరికగా నిలవనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories