ఆ పార్కులో కాకులే చెత్త ఎత్తే కార్మికులు

ఆ పార్కులో కాకులే చెత్త ఎత్తే కార్మికులు
x
Highlights

మనదేశంలో పనికి ఆహార పథకం ఉంది. పని చేస్తే, డబ్బులిస్తుంది ప్రభుత్వం. అయితే ఇదే కాన్సెప్టుకు జస్ట్‌ ఫర్ చేంజ్‌. అదేంటంటే, ఇక్కడ మనుషులతో పనికి ఆహార...

మనదేశంలో పనికి ఆహార పథకం ఉంది. పని చేస్తే, డబ్బులిస్తుంది ప్రభుత్వం. అయితే ఇదే కాన్సెప్టుకు జస్ట్‌ ఫర్ చేంజ్‌. అదేంటంటే, ఇక్కడ మనుషులతో పనికి ఆహార పథకమైతే, ఓ పార్కులో కాకులకు పనికి ఆహార పథకముంది. మీరు విన్నది నిజమే, కాకులకు ఫుడ్‌ ఫర్‌ వర్క్‌ స్కీమ్. మనుషులైతే పని చేస్తారు, మరి కాకులేం చేస్తాయి అనేగా మీ డౌట్. మనుషులకే కనువిప్పు కలిగేలా, ఓ మహా పవిత్రమైన పనిలో, చిత్తశుద్దిగా నిమగ్నమయ్యాయి. కాకులు.

కాకులేం చేస్తున్నాయో మీరు గమనించారా. అర్థంకాలేదా మరోసారి అబ్జర్వ్ చేయండి. చెత్తాచెదారం తెచ్చి డబ్బాలో వేస్తున్నాయని పరిశీలించారా....? అదే మీ పరిశీలన అయితే, మీరు అబ్జర్వేషన్‌ పర్ఫెక్ట్. ఔను. చెత్తను ఎత్తడంలో కాకుల చిత్తశుద్దిని, చిత్తగించి చూస్తున్న జనాలు, ఆశ్చర్యపోతున్నారు.

ఇది ఫ్రాన్స్‌లోని ఒక థీమ్‌ పార్క్. ఉద్యానవానికి వచ్చే జనాల్లో కొందరు ఊరికే ఉండరు కదా. చెత్తను డస్బ్‌ బిన్‌లోనే వేయాలని పెద్దపెద్ద అక్షరాలతో బోర్డులు పెట్టినా, అవేమీ పట్టించుకోకుండా, ఎక్కడ పడితే అక్కడ పారేస్తుంటారు. దీంతో ఎటు చూసినా, ఉద్యానవనంలో చెత్తాచెదారమే. ఫలితం పర్యావరణ కాలుష్యం. చెత్తను ఎత్తేసేందుకు సిబ్బంది వున్నా, సిగరెట్‌‌లాంటి చిన్నచిన్న ముక్కలు, వారికి కనబడకపోవచ్చు. కానీ కాకులు, మాత్రం ఇలాంటి చిన్నచిన్న చెత్తలను ఎత్తడంలో ఎక్స్‌పర్ట్స్.

థీమ్ పార్క్‌లో సందర్శకులు పడవేసే చెత్తా చెదారం, సిగరెట్ పీకలను ఏరివేస్తుంటాయి కొన్ని కాకులు. ఈ పార్కును స్వచ్ఛ పార్కుగా మార్చేందుకు ఆ థీమ్ పార్కు నిర్వాహకులే ఇలాంటి కాకులకు శిక్షణనిచ్చారు. మొత్తం ఆరు కాకులకు ట్రైనింగ్‌ ఇచ్చారు. ఈ కాకుల చర్య ద్వారా పర్యావరణాన్ని జాగ్రత్తగా పరిరక్షించుకోవటం గురించి సందర్శకులకు ప్రకృతి స్వయంగా బోధిస్తుందని అంటున్నారు పార్కు సిబ్బంది. ఇంతకీ ఈ తెలివైన ఆరు కాకులకు పనికి ఆహార పథకమేంటో చెప్పలేదు కదా. తిండి ముక్కలు. ఒక చెత్త లేదా ఒక సిగరెట్ పీకను తీసుకొచ్చి, చెత్తబుట్టలో పడేసిన ప్రతిసారీ, ఆ పనిచేసిన కాకికి ఇష్టమైన తిండి ముక్కను ప్రతిఫలంగా ఇస్తారట.

బహుమానంగా అందే బెడ్‌ ముక్క కోసం, చాలా డెడికేషన్‌గా చెత్తను ఏరివేస్తుంటాయి కాకులు. ఈ శిక్షణ పొందిన పక్షులు, కాకుల జాతిలోని రూక్స్‌ వర్గానికి చెందినవి. ఇవి మన వీధుల్లో మనతో పాటు బతికే సామాజిక జీవులే. కానీ చాలా తెలివైనవి. ఓ పేపర్‌ ముక్క లేదంటే చెత్తను తెచ్చి ఇస్తే, ఓ చికెన్‌ ముక్క లేదంటే ఫుడ్‌ పీస్ ఇస్తారని గ్రహిస్తే చాలు, రోజంతా అదే పని చేయాలనుకుంటాయి కాకులు. మనమేం చెయ్యాలో, అవి చేసి, మనకు చూపిస్తున్నాయి. చెత్తాచెదారంతో ఒకవైపు భూగోళం వేడెక్కుతోంది. ఏం చేస్తే, భూతాపం తగ్గి, భూమి చల్లబడుతుందో, మనకు చేసి చూపిస్తున్నాయి కాకులు.

Show Full Article
Print Article
Next Story
More Stories