షాకింగ్ న్యూస్.. గాలిలో కదులుతుంది.. ఎగురుతుంది..

షాకింగ్ న్యూస్.. గాలిలో కదులుతుంది.. ఎగురుతుంది..
x
Highlights

క‌రోనా వైర‌స్ గురించి మరో షాకింగ్ న్యూస్ చెప్పారు ప‌రిశోధ‌కులు. క‌రోనా సోకిన రోగుల నుంచి ఈ వైర‌స్ 13 అడుగుల వ‌ర‌కు వ్యాపిస్తోంద‌ని ప‌రిశోధ‌కులు చెబుతున్నారు.

క‌రోనా వైర‌స్ గురించి మరో షాకింగ్ న్యూస్ చెప్పారు ప‌రిశోధ‌కులు. క‌రోనా సోకిన రోగుల నుంచి ఈ వైర‌స్ 13 అడుగుల వ‌ర‌కు వ్యాపిస్తోంద‌ని ప‌రిశోధ‌కులు చెబుతున్నారు.అయితే, గాలి ద్వారా వచ్చే వైరస్ 13 అడుగుల దూరంలో ఉన్న వారికి సోకే అవ‌కాశాలు త‌క్క‌వ‌ని చైనాలోని బీజింగ్ కు చెందిన‌ అకాడమీ ఆఫ్‌ మిలిటరీ మెడికల్‌ సైన్సె్‌స్‌కు ప‌రిశోధ‌కులు అంటోన్నారు.

వుహాన్‌లోని ఓ హాస్పిటల్లో కొవిడ్‌ జనరల్‌, ICU నుంచి న‌మునాలు సేకరించి పరీక్షించారు. 13 అడుగులు లేదా 4 మీ. దాకా వైరస్‌ గాలిలో తేలుతూ ప్రయాణించగలదని తేల్చారు. సోషల్ డిస్టాన్స్ 13 అడుగుల దూరంలో నిలబడాలి. చైనా శాస్త్రవేత్తల పరిశోధన వివరాలు.. యుఎస్‌ సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌కు చెందిన ఎమర్జింగ్‌ ఇన్ఫెక్షస్‌ డిసీజెస్ జర్నల్‌లో రాశారు.

ఆసుప‌త్రి వార్డుల్లోని ఫ్లోర్‌లపైనే వైరస్‌ ఉండటాన్ని వాళ్లు ప‌రిశోధ‌న‌లో గ‌మ‌నించారు. అంటే ఎవరైనా దగ్గినా, తుమ్మినా... తుంపర్లు వ‌స్తే.. గాలిలో ఎగురుతూ వెళ్తాయి. గాలి లేక‌పోతే తుంప‌ర్లు అక్క‌డే ప‌డ‌తాయి.

కరోనా రోగి చుట్టుపక్కల అంటే బెడ్‌కు, ఉమ్మితొట్టె పైభాగం, తలుపు గడియపై వైరస్‌ ఎక్కువగా ఉంటుంది. ఐసీయూ సిబ్బంది బూట్లపై కరోనా వైరస్ ఉండ‌టం గ‌మ‌నించారు. కనీసం 8 అడుగుల సోషల్ డిస్టాన్స్ అవ‌స‌ర‌మంటున్నారు. దగ్గగగా ఉంటే కరోనా సోకే ప్రమాదం ఎక్కువ అని చైనా ప‌రిశోథ‌కులు తేల్చారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories