కోవిడ్-19 ను నియంత్రించేందుకు సంప్రదాయ వైద్యం

కోవిడ్-19 ను నియంత్రించేందుకు సంప్రదాయ వైద్యం
x
Highlights

చైనాలో కోవిడ్-19 (కరోనా వైరస్) కారణంగా మరణించిన వారి సంఖ్య 1600 కు పెరిగింది. అలాగే ఒక్క చైనాలోనే సంక్రమణ కేసుల సంఖ్య 67,535 కు పెరిగింది.

చైనాలో కోవిడ్-19 (కరోనా వైరస్) కారణంగా మరణించిన వారి సంఖ్య 1600 కు పెరిగింది. అలాగే ఒక్క చైనాలోనే సంక్రమణ కేసుల సంఖ్య 67,535 కు పెరిగింది. వీరిలో 11, 053 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. వ్యాధి సోకినట్లు అనుమానిస్తున్న వారి సంఖ్య 8096కు పెరిగింది. ఈ అంటువ్యాధి వల్ల హుబే ప్రాంతం మరింత ఎక్కువగా ప్రభావితమైందని చైనాకు చెందిన జాతీయ ఆరోగ్య కమిషన్ తెలిపింది. శుక్రవారం 2,420 కొత్త కేసులు నమోదయ్యాయి. వీరిలో 139 మంది మరణించారు. వీరిలో హుబే వెలుపల హెనాన్‌లో ఇద్దరు, బీజింగ్, చాంగ్‌కింగ్‌లో ఒక్కొక్కరు మరణించారని కమిషన్ తెలిపింది.

మరోవైపు కోవిడ్‌–19ను నియంత్రించేందుకు అన్ని మార్గాలను ఉపయోగించుకుంటోంది ప్రభుత్వం. అందులో భాగంగా ఆరోగ్యశాఖ అధికారులు ఆర్టీఫీషియల్‌ ఇంటెలిజెన్స్, క్లౌడ్‌ కంప్యూటింగ్, బిగ్‌ డేటా వంటి టెక్నాలజీలను వాడాలని అధ్యక్షుడు జిన్‌పింగ్‌ పిలుపునిచ్చారు. అలాగే ఈ మహమ్మారిని ఎదుర్కొనేందుకు చైనా సంప్రదాయ వైద్యాన్ని సమర్థంగా ఉపయోగిస్తోంది. వ్యాధి సోకిందని నిర్ధారణ అయిన వారిలో కనీసం సగంమందికి సంప్రదాయ వైద్యంతో సాంత్వన చేకూరిందని చైనా ఆరోగ్యశాఖ అధికారి ఒకరు తెలిపారు.

ఇదిలావుంటే చైనాలో కోవిడ్-19 వైరస్ వ్యాప్తి ఎక్కువవడంతో.. నివారించేందుకు సర్వశక్తులు ఒడ్డుతోంది చైనా ప్రభుత్వం. ఇప్పటికే చైనాలోని వివిధ స్థాయి ఆర్థిక విభాగాలు నిరంతరం నిధులను సమకూరుస్తూనే ఉన్నాయి. ఫిబ్రవరి 13 నాటికి, చైనాలోని వివిధ ప్రదేశాల సంబంధిత విభాగాలు మొత్తం 80.55 బిలియన్ చైనీస్ యువాన్లు అందజేసినట్టు తెలుస్తోంది.

ఇటీవల చైనా కేంద్ర ప్రభుత్వం 17.29 బిలియన్ల చైనీస్ యువాన్ అంటువ్యాధి నివారణకు కేటాయించింది. ఈ డబ్బును హుబే ప్రావిన్స్ మరియు దేశంలోని వివిధ ప్రదేశాలకు తరలించారు. అంటువ్యాధి బారిన పడి, కొందరు వ్యాపారాలు, ముఖ్యంగా మధ్యస్థ మరియు చిన్న సంస్థలు సాపేక్షంగా భారీ ఒత్తిడికి గురయ్యాయి. కొన్ని సంస్థలలో ఉత్పత్తి వాయిదా పడింది. ఈ దృష్ట్యా, చైనా సంబంధిత విభాగాలు ఆర్థిక సహాయ విధానాలను జారీ చేశాయి మరియు చిన్న మరియు సూక్ష్మ సంస్థలకు పన్నును తగ్గించాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories