కోవిడ్ -19 : 50 వేల మందికి సోకిన వైరస్

కోవిడ్ -19 : 50 వేల మందికి సోకిన వైరస్
x
Highlights

కరోనావైరస్ (కోవిడ్ -19) వ్యాప్తికి కేంద్రమైన హుబీ ప్రావిన్స్‌లో ఒకే రోజులో దాదాపు 15 వేల కొత్త కేసులు మరియు 242 కొత్త మరణాలు నమోదయ్యాయని అధికారులు...

కరోనావైరస్ (కోవిడ్ -19) వ్యాప్తికి కేంద్రమైన హుబీ ప్రావిన్స్‌లో ఒకే రోజులో దాదాపు 15 వేల కొత్త కేసులు మరియు 242 కొత్త మరణాలు నమోదయ్యాయని అధికారులు ప్రకటించారు, కొత్త ఇన్‌ఫెక్షన్లను లెక్కించడానికి రోగనిర్ధారణ సాధనాలను విస్తరించాలని అధికారులు కోరుతున్నారు. ఇప్పటి వరకు, ప్రత్యేకమైన పరీక్షా వస్తు సామగ్రి ద్వారా నిర్ధారించబడిన అంటువ్యాధులు మాత్రమే దృవీకరించబడినవిగా వెల్లడించారు. అయితే ఆ ఎక్యూప్మెంట్ అనుకున్నంతమేర అందుబాటులో లేకపోవడంతో.. చాలా మందికి పరీక్షలు ఆలస్యం అవుతున్నాయి. కరోనావైరస్ (కోవిడ్ -19) మరణాలు 1,300 పెరిగాయి.. అంతేకాదు 50,000 మందికి పైగా ఈ వైరస్ సోకింది.

ఇదిలావుంటే కరోనావైరస్ (కోవిడ్ -19) వ్యాప్తి కారణంగా దలైలామా తన బహిరంగ కార్యక్రమాలను రద్దు చేసినట్లు ఆయన కార్యాలయం తెలిపింది. వాస్తవానికి మార్చి 9 న, దలైలామా భారతదేశంలోని ధర్మశాలలో ఒక బోధనా కార్యక్రమంలో పాల్గొనవలసి ఉంది. ఈ షెడ్యూల్‌ పై ఇంకా ఎటువంటి నిర్ణయము తీసుకోలేదు. ఈ సందర్బంగా దలైలామా కార్యాలయం కూడా ఒక విజ్ఞప్తిని జారీ చేసింది, అందులో ప్రపంచవ్యాప్తంగా ఉన్న టిబెటన్లను "మానవాళి యొక్క శ్రేయస్సుకు సమిష్టిగా ప్రార్థించాలని" కోరారు .

మరోవైపు హుబీ ప్రావిన్స్‌లో కోవిడ్-19 వైరస్ దాటికి చనిపోయిన వారి సంఖ్య పెరుగుతుండటం, వైరస్ వ్యాప్తి అంతకంతకు పెరుగుతుండటంతో టెక్ షోలు, ఆటో రేసింగ్ ప్రదర్శనలను రద్దు చేసుకున్నారు. 2006 నుండి ప్రతి సంవత్సరం, మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ ప్రధాన టెక్ కంపెనీల ప్రతినిధులను బార్సిలోనాకు వస్తారు.. సాధారణంగా ఈ కార్యక్రమనికి ప్రపంచవ్యాప్తంగా 200 దేశాల నుండి 100,000 మందికి పైగా హాజరవుతారు. ఈ సంవత్సరం ఈవెంట్ ఈ నెల చివరిలో ప్రారంభం కావాల్సి ఉంది. అయితే వైరస్ వ్యాప్తితో సమావేశం రద్దయింది. అంతేకాదు బుధవారం, వాణిజ్య ప్రదర్శనను నిర్వహించే పరిశ్రమ సమూహం, గ్లోబల్ సిస్టమ్ ఫర్ మొబైల్ కమ్యూనికేషన్స్ అసోసియేషన్ , "కరోనావైరస్ వ్యాప్తి, ప్రయాణ ఆందోళన మరియు ఇతర పరిస్థితుల కారణంగా ఈ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు తెలిపింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories