కొవిడ్‌-19 వైరస్.. అంటువ్యాధుల సంఖ్య 20% తగ్గింది..

కొవిడ్‌-19 వైరస్.. అంటువ్యాధుల సంఖ్య 20% తగ్గింది..
x
Highlights

ఫిబ్రవరి 12 న చైనాలో కరోనావైరస్(కొవిడ్‌-19 వైరస్.. అంటువ్యాధుల సంఖ్య 20% తగ్గింది..) మహమ్మారి భారిన పడి 94 మంది మరణించారు. దాంతో ఇప్పటివరకు మరణించిన...

ఫిబ్రవరి 12 న చైనాలో కరోనావైరస్(కొవిడ్‌-19 వైరస్.. అంటువ్యాధుల సంఖ్య 20% తగ్గింది..) మహమ్మారి భారిన పడి 94 మంది మరణించారు. దాంతో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 1,110 కు చేరినట్లయింది. అయితే ఈ 94 కొత్త మరణాలు కూడా హుబీ ప్రావిన్స్ లో సంభవించాయి. ఈ మేరకు హుబే ఆరోగ్య కమిషన్ వెల్లడించింది.

హుబే మధ్య ప్రావిన్స్లో మరో 1,638 కొత్త కేసులు నమోదైనట్టు వెల్లడించింది. ప్రభుత్వం ద్వారా విడుదల అయిన గణాంకాల ఆధారంగా ఇప్పుడు చైనా అంతటా 44,200 కన్నా ఎక్కువ కేసులు నమోదయ్యాయి. ఇదిలావుంటే కరోనావైరస్ పేరును కొవిడ్-19గా ప్రపంచ ఆరోగ్య సంస్థ - WHO నామకరణం మార్చింది. కరోనా, వైరస్, డిసీజ్‌.. అనే ఆంగ్లపదాల తొలి అక్షరాలను కలిపితే కొవిడ్‌గా పేరు పెట్టారు. చైనాలోని వుహాన్‌లో గతేడాది డిసెంబర్‌లో కరోనా వైరస్‌ ఉనికి బయటపడింది. దీంతో.. కొవిడ్ చివరు ఆ ఏడాదినీ చేర్చారు. కొవిడ్‌-19గా WHO వ్యవహరించనుంది. "మేము భౌగోళిక స్థానం, ఒక జంతువు, ఒక వ్యక్తి లేదా వ్యక్తుల సమూహాన్ని సూచించని పేరును పెట్టాలని అనుకున్నాం, ఈ పేరు ఉచ్చరించదగినది మరియు వ్యాధికి సంబంధించినది" అని WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ అధికారికంగా పేర్కొన్నారు మంగళవారం జెనీవాలో జరిగిన మీడియా సమావేశంలో ఈ పేరును ప్రకటించారు.

ఇదిలావుంటే జాతీయంగా కొత్త అంటువ్యాధుల సంఖ్య 20% తగ్గింది, అంటే రోజుకు 3,062 నుండి 2,478 కు తగ్గిందని చైనా ఆరోగ్య శాఖ వెల్లడించింది. మరోవైపు ముందస్తు హెచ్చరికలను చేసిన వైద్యుడి మరణం ప్రజల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. ఆ వైద్యుడు హెచ్చరించినా వినకుండా అతనిపైనే చర్యలు తీసుకున్న అధికారులను ప్రభుత్వం తొలగించింది. వారిలో హుబీ హెల్త్ కమిషన్ చైర్మన్, అలాగే కార్యదర్శి ఉన్నారు. వారు ఈ కమిషన్ లో సీనియర్ అధికారులుగా ఉన్నారు. డాక్టర్ లి చికిత్సపై పోలీసులు దర్యాప్తు చెంసేందుకు వీలుగా చైనా కేంద్ర ప్రభుత్వం తన అత్యున్నత అవినీతి నిరోధక సంస్థలోని ఒక బృందాన్ని హుబేకి పంపింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories