ఆ రోగిని ఎప్పటికీ కనిపెట్టలేం.. WHO కీలక ప్రకటన

ఆ రోగిని ఎప్పటికీ కనిపెట్టలేం.. WHO కీలక ప్రకటన
x

WHO 

Highlights

గత ఏడాది చైనాలోని వూహాన్ నగరంలో కరోనా పట్టింది.

గత ఏడాది చైనాలోని వూహాన్ నగరంలో కరోనా పట్టింది. అయితే అక్కడి నుంచి ఉనికి చాటుకున్న కరోనా ప్రపంచదేశాలను గడగడలాడిస్తోంది. లక్షలాది మందిని ఈ మహమ్మారి పొట్టనపెట్టుకుంది. అయితే ప్రపంచ దేశాలన్ని ఇప్పటికి చైనా వైఖరిని ప్రశ్నిస్తున్నాయి. కరోనా వైరస్ కట్టడి విషయంలో చైనా నిర్ణక్ష్యంపై అన్ని దేశాలు ముక్తకంఠంతో ఖండిస్తున్నాయి. ఇక ఆ దేశంలో కరోనా వ్యాప్తి చెందినప్పటి నుంచి అంతర్జాతీయ మీడియాతో సహా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ.హెచ్.వో)ను నిషేధించింది. తాజాగా అక్కడ పరిస్థితులు చక్కబడిన తర్వాత (డబ్ల్యూ.హెచ్.వో)ను అనుమతించింది.

కరోనా వైరస్ మూలాలు కనుక్కునే పనిలో ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూ.హెచ్.వో పడింది. దీనికోసం 10 మంది నిపుణులతో కూడిన డబ్ల్యూ.హెచ్.ఓ బృందం చైనాలోని కరోనా పుట్టినిల్లు వూహాన్ కు చేరుకుంది. ఈ నేపథ్యంలోనే కరోనా సోకిన తొలి వ్యక్తి 'పేషెంట్ జీరో'ను వెతికే పనిలో పడింది. ఈ క్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక ప్రకటన చేసింది. చైనాలో కరోనా సోకిన తొలి వ్యక్తిని కనిపెట్టడం అసాధ్యమని డబ్ల్యూ.హెచ్.వో పేర్కొంది. ఖచ్చితంగా చెప్పాలంటే ఎప్పటికీ కనిపెట్టలేకపోవచ్చని వెల్లడించింది. ఈ సందర్భంగా మాట్లాడిన లీడ్ మారియా వాన్ కరోనా సోకిన తొలి వ్యక్తిని కనిపెట్టడం అసాథ్యమని చెప్పారు. ఈ మహామ్మరి ధాటికి అనేక మంది ప్రాణాలు కొల్పోయారని, చైనాలో సైతం ఈ వైరస్ విజృంభించిందని ఆయన అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories