
కరోనా యమ డేంజర్. మూడు అక్షరాలే అయినా ముచ్చెటమలు పట్టిస్తోంది. దేశాలకు దేశాలే చిగురుటాకులా వణుకుతున్నాయి. నివారణకు ముందు జాగ్రత్తలు తీసుకుంటోన్నా...
కరోనా యమ డేంజర్. మూడు అక్షరాలే అయినా ముచ్చెటమలు పట్టిస్తోంది. దేశాలకు దేశాలే చిగురుటాకులా వణుకుతున్నాయి. నివారణకు ముందు జాగ్రత్తలు తీసుకుంటోన్నా లోలోపల భయం ప్రపంచాన్ని వెంటాడుతోంది. కల్లోల కరోనా కంట్రోల్ కోసం దేశాలు పోటాపోటీగా ప్రయత్నాలు చేస్తున్నాయి. వ్యాక్సిన్ తయారీ పనిలో పడ్డాయి. అయితే ఇప్పుడు ఈ విషయంలో అగ్రరాజ్యం అమెరికా ముందడుగు వేసింది. కరోనా వైరస్ కి వాక్సిన్ ని తయారు చేసి తొలి ట్రయల్‌గా ఓ మహిళపై ప్రయోగించింది. సియాటిల్‌కు చెందిన 43 ఏళ్ళ మహిళ హాల్లెర్‌పై వాక్సిన్‌ను తొలిసారి ప్రయోగించామని అమెరికా అధికారికంగా ప్రకటించింది. అదే మహిళకు రెండో ఇంజెక్షన్ కూడా ఇచ్చామని స్పష్టం చేసింది.
క్లినికల్ ట్రయల్స్‌లో భాగంగా హాల్లెర్‌కు రెండు ఇంజెక్షన్లు చేయడం జరిగింది. మార్చి 16వ తేదీన కరోనా వాక్సిన్‌ను ప్రయోగాత్మకంగా వినియోగించామని, సియాటిల్‌లోని కైజర్ పెర్మనెంట్ వాషింగ్టన్ హెల్త్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌లో ఈ ప్రయోగం జరిగిందని అమెరికా వివరించింది. ఎంఆర్ఎన్ఏ-1273 (mRNA-1273) పేరుతో రూపొందించిన కరోనా వైరస్ వాక్సిన్ ఈ భయంకర వైరస్‌ను పూర్తిగా నిర్మూలిస్తుందని ప్రస్తుతం ప్రయోగశాలలో ప్రతీ ఒక్కరు గట్టిగా విశ్వసిస్తున్నారు. ఈ వాక్సిన్ ప్రాథమిక దశలో విజయవంతమైతే.. తరువాతి దశలో అమెరికా, చైనా, దక్షిణ కొరియాలలో ప్రయోగించి చూస్తామని లాబొరేటరీ నిర్వాహకులు చెబుతున్నారు. కరోనా వైరస్ వాక్సిన్‌ను తొలిసారి తీసుకున్న జెన్నీఫర్ హాల్లెర్ కరోనాపై ప్రపంచం ఏమీ చేయలేక చతికిలా పడిన సందర్భంలో తనకు ఈ అవకాశం దక్కడం ఆనందంగా వుందని వెల్లడించింది. తొలి రెండు ఇంజెక్షన్లను స్వీకరించిన హాల్లెర్ ఆ తర్వాత ఫలితాల ప్రయోగంలోను భాగస్వామిగా కొనసాగుతున్నట్లు వెల్లడించారు.
A long-awaited study in healthy people testing a potential vaccine against the new coronavirus is underway in Seattle. Read and watch exclusive @AP coverage: https://t.co/6eWnjsMgJ9 pic.twitter.com/vs3EmsKSjs
— AP Health & Science (@APHealthScience) March 16, 2020

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



