చైనాలో కొత్తగా 14 కరోనా కేసులు

చైనాలో కొత్తగా 14 కరోనా కేసులు
x
Representational Image
Highlights

కరోనా పుట్టినిళ్లగా భావిస్తున్న చైనాలో ఆదివారం మళ్లీ కరోనా కేసులు నమోదవుతున్నాయి.

కరోనా పుట్టినిళ్లగా భావిస్తున్న చైనాలో ఆదివారం మళ్లీ కరోనా కేసులు నమోదవుతున్నాయి. అక్కడ కొత్తగా 14 కరోనా కేసులు నమోదయినట్లు అక్కడి ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. 12 మందికి వ్యాధి లక్షణాలు కనిపించకపోవడం ఆందోళన కలిస్తోందని పేర్కొన్నారు. ఇక మరో ఇద్దరిలో ఒకరు విదేశాల నుంచి రాగా.. మరొకరికి స్థానికంగా వైరస్‌ సంక్రమించినట్లు చైనా జాతీయ ఆరోగ్య కమిషన్‌ ప్రకటించింది.

చైనాలో కేసుల సంఖ్య 82,877కు చేరుకుంది. 4,633 ఈ వ్యాధి బారిన పడి మరణించారు. ఏప్రిల్ 26న హుబేయ్‌ ప్రావిన్స్‌లో కరోనా కేసులు లేవని ప్రకటించారు. అయితే శనివారం నాటికి అక్కడ 651 కేసులు నమోదయ్యాయి. అయితే వారిలో ఎలాంటి వ్యాధి లక్షణాలు లేవని వెల్లడించారు. చైనా ప్రభుత్వం విదేశాల నుంచి ఎవ్వరూ రాకుండా ఆంక్షలు విధించింది.



Show Full Article
Print Article
Next Story
More Stories