ఒక్క కరోనా కేసు నమోదు కానీ దేశాలు ఇవే!

ఒక్క కరోనా కేసు నమోదు కానీ దేశాలు ఇవే!
x
Representational Image
Highlights

కరోనావైరస్ .. ప్రపంచ దేశాలని వణికిస్తున్న మహమ్మారి వైరస్.. చైనా నగరమైన వుహాన్‌లో ప్రారంభమైన ఈ వైరస్ ప్రపంచవ్యాప్తంగా వందలాది దేశాలను ప్రభావితం చేసింది.

కరోనావైరస్ .. ప్రపంచ దేశాలని వణికిస్తున్న మహమ్మారి వైరస్.. చైనా నగరమైన వుహాన్‌లో ప్రారంభమైన ఈ వైరస్ ప్రపంచవ్యాప్తంగా వందలాది దేశాలను ప్రభావితం చేసింది, 1.2 మిలియన్ల మందికి సోకింది.. 60,000 మందికి పైగా మరణించారు. దీనిని అరికట్టడానికి ప్రపంచ దేశాలన్నీ ఒక్కటై పోరాటం చేస్తున్నాయి. ఇప్పటికే కొన్ని దేశాలు లాక్ డౌన్ ని విధించాయి. అమెరికా, ఐరోపా దేశాలు ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్ మరియు జర్మనీలపై దీని ప్రభావం ఎక్కువగా ఉంది. అయితే దీనికి వైరస్ కనిపెట్టేందుకు శాస్త్రవేత్తలు సైతం బాగానే కృషి చేస్తున్నాయి.

ఇక ఇది ఇలా ఉంటే ప్రపంచాన్ని వణికిస్తున్న వైరస్ కొన్ని దేశాలలో మాత్రం దీని లక్షణాలే లేవు, పసిఫిక్ ద్వీప దేశాలలోని చిన్న చిన్న దేశాలలో ఇప్పటివరకు దిని లక్షణాలే లేవు.. అంతేకాకుండా.. సాల్మన్ ఐలాండ్, వనౌతు, సమోవా, కిరిబితి, మైక్రోనేషియా, టోంగా, ది మార్షల్, ఐలాండ్ పలవౌ, టువాలు, నౌతు దేశాలలో ఇప్పటివరకు ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు.. ఇక ఆసియాలో నార్త్ కొరియా, యెమెన్, తుర్కెమిస్థాన్, తజికిస్థాన్‌‌లలో ఒక్క కరోనా కేసు నమోదు కాలేదు.

ఇక కరోనా వైరస్ కేసులు అత్యధికంగా అమెరికాలో నమోదు అయ్యాయి. అక్కడ 2లక్షల మందికి ఈ వైరస్ సోకగా.. 10వేల మంది చనిపోయారు. అమెరికా తర్వాత స్పెయిన్, ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్ లలో కరోనా కేసులు ఎక్కువగా నమోదు అయ్యాయి. ఇక భారత్ విషయానికి వచ్చేసరికి ఇప్పటివరకు దేశంలో నాలుగు వేలకి పపైగా కరోనా కేసులు నమోదు కాగా, వంద మందికి పైగా చనిపోయరు..


Show Full Article
Print Article
More On
Next Story
More Stories