coronavirus : రెండు రోజుల్లోనే ఎంత మంది మృతిచెందారో తెలుసా?

coronavirus : రెండు రోజుల్లోనే ఎంత మంది మృతిచెందారో తెలుసా?
x
Highlights

చైనాలో కరోనావైరస్ ధాటికి ఇప్పటివరకూ 259 మంది మరణించినట్టు ఆ దేశ ప్రభుత్వం వెల్లడించింది. మరణించిన వారి సంఖ్య 259 కు పెరిగిందని.. అంతేకాదు...

చైనాలో కరోనావైరస్ ధాటికి ఇప్పటివరకూ 259 మంది మరణించినట్టు ఆ దేశ ప్రభుత్వం వెల్లడించింది. మరణించిన వారి సంఖ్య 259 కు పెరిగిందని.. అంతేకాదు ధృవీకరించబడిన అంటువ్యాధుల సంఖ్య దాదాపు 12,000 కు పెరిగిందని ఫిబ్రవరి 1న చైనా ప్రభుత్వం తెలిపింది. జాతీయ ఆరోగ్య కమిషన్ తన రోజువారీ వివరాల ఆధారంగా మరో 46 మంది శ్వాసకోశ వ్యాధి బారిన పడ్డారని చెప్పింది. ఈ మరణాలలో ఒకటి మినహా మిగిలినవి కరోనావైరస్ వ్యాప్తికి కేంద్రంగా ఉన్న హుబీ ప్రావిన్స్‌లో సంభవించినట్టు వెల్లడించింది.

వారం రోజుల క్రితం చైనా దేశవ్యాప్తంగా అలారం వినిపించినప్పటి నుండి కొత్త మరణాల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. మొన్నటివరకు 175 మంది ఈ వైరస్ భారిన పడి చనిపోయినట్టు తెలిసింది. అయితే తాజాగా రెండు రోజుల వ్యవధిలోనే మరణాల సంఖ్య అనూహ్యంగా పెరిగిపోయింది. ఒక్కరోజులోనే 80 మందికి పైగా మృతిచెందారు. దీంతో చైనా ప్రభుత్వం హై అలర్ట్ అయింది. ఇతర ప్రాంతాలకు ఈ వైరస్ వ్యాప్తి కాకుండా ఉండేందుకు కొన్ని ప్రాంతంలోని ప్రజలను నిర్బంధం చేసింది. వైరస్ వ్యాప్తి చెందకుండా గత వారం రోజులుగా హుబీలోని మిలియన్ల మంది ప్రజలపై నిర్బంధ చర్యలు కొనసాగుతోన్నాయి. ఈ ప్రాంతంలో దేశంలో మరెక్కడా లేని వైరస్ నివారణ చర్యలు ఉన్నాయి. దీన్ని బట్టే అర్ధం చేసుకోవచ్చు దీని ప్రభావం చైనాపై ఎంత మేర ఉందనేది.

మరోవైపు కరోనావైరస్ వ్యాప్తిని నివారించడానికి ఫిబ్రవరి వరకు అవసరమైన పరిశ్రమలు తప్ప బీజింగ్ నగరంలోని కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులు ఇంటినుంచి పనిచేసుకోవాలని ప్రకటించింది. దీంతో ప్రావిన్సులు మరియు నగరాల్లో పని ఆలస్యంగా జరుగుతోంది. ఇక ఫిబ్రవరి 13 అర్ధరాత్రి వరకు వ్యాపారాలు తిరిగి ప్రారంభించవద్దని హుబీ అధికారులు ప్రకటించారు. షాంఘై, హాంగ్కింగ్, అన్హుయి, ఫుజియాన్, గ్వాంగ్డాంగ్, జియాంగ్సు, జియాంగ్జీ, యునాన్, సుజౌ, ఇన్నర్ మంగోలియా , జీజియాంగ్ లలో ఫిబ్రవరి అర్ధరాత్రి వరకు పనులను ప్రారంభించవద్దని ఆదేశించింది. కాగా ఈ వైరస్ గతేడాది డిసెంబరులో హుబీ ప్రావిన్షియల్ రాజధాని వుహాన్లో ఉద్భవించింది. వుహాన్ లోని అటవీ ప్రాంతానికి దగ్గర్లో మాంసం విక్రయించే మార్కెట్లో ఈ వైరస్ ను కనుగొన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories