ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయతాండవం.. అమెరికాలో ఆగని మృత్యునాదం!

ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయతాండవం.. అమెరికాలో ఆగని మృత్యునాదం!
x
Highlights

కరోనా వైరస్ రోజురోజుకు పెరుగుతూ.. ఉగ్రరూపం దాల్చుతుంది. ఈ ప్రాణాంతక వైరస్ ధాటికి అన్ని దేశాలు వనికిపోతున్నాయి.

కరోనా వైరస్ రోజురోజుకు పెరుగుతూ.. ఉగ్రరూపం దాల్చుతుంది. ఈ ప్రాణాంతక వైరస్ ధాటికి అన్ని దేశాలు వనికిపోతున్నాయి. అమెరికా, యూకే, బ్రెజిల్ దేశాల్లో కరోనా విలయతాండవం చేస్తోంది.

ఈ వైరస్ కేవలం 24 గంటల్లోనే దాదాపు లక్ష కేసులు నమోదయ్యాయి. కరోనా కేసుల సంఖ్య 45 లక్షలు దాటింది. అలాగే మృతుల సంఖ్య మూడు లక్షలు దాటింది. అమెరికాలో రోజుకు 20వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఒక్క రోజే ఆ దేశంలో 26,398 కొత్త కేసులు నమోదయ్యాయి. బ్రెజిల్‌లో నిన్న 13,761 కేసులు, రష్యాలో 9,974 కేసులు నమోదయ్యాయి.

ప్రపంచ వ్యాప్తంగా కేసుల సంఖ్య చూస్తే.. కేసులు 45,21,174, మరణాలు 3,03,070, కోలుకున్నవారు 17,02,113 చికిత్స పొందుతున్న వారి 25,15,991 మంది ఉన్నారు. మరణాల రేటులోనూ అమెరికా టాప్ ప్లేస్‌లో నిలిచింది. అక్కడ గురువారం 1,703 మంది చనిపోగా, and స్పెయిన్ లో 217, యూకేలో 428, ఇటలీలో 262, బ్రెజిల్‌లో 835, ఫ్రాన్స్‌లో 351, మెక్సికోలో 294, కెనడాలో 170 మంది ఈ వైరస్ బారిన పడి మరణించారు. మొత్తం మరణాల్లో అమెరికాలో 86,90 00 మంది మరణించారు. భారత్‌లో కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. దేశంలో గత 24 గంటల్లో 3942 కేసులు నమోదయ్యాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories