చైనాలో ఆ మరణాల కంటే 'కరోనావైరస్' సంఖ్య ఎక్కువ

చైనాలో ఆ మరణాల కంటే కరోనావైరస్ సంఖ్య ఎక్కువ
x
చైనాలోని వుహాన్‌లో తాత్కాలిక ఆసుపత్రిగా మార్చబడిన కన్వెన్షన్ సెంటర్‌లో పడకల మధ్య నడుస్తున్న కార్మికుడు
Highlights

చైనాలో నెలరోజుల నుంచి కరోనావైరస్ మహమ్మారి ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే ఈ వైరస్ వ్యాప్తి ద్వారా మరణించిన వారి సంఖ్య 490 కి చేరుకుంది. గత...

చైనాలో నెలరోజుల నుంచి కరోనావైరస్ మహమ్మారి ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే ఈ వైరస్ వ్యాప్తి ద్వారా మరణించిన వారి సంఖ్య 490 కి చేరుకుంది. గత 11 రోజులలో కొత్త కేసులు రెండంకెల శాతం పెరిగాయి, ఈ వైరస్ తగ్గుతుందన్న సంకేతం లేకపోవడంతో ఆ దేశ ప్రభుత్వం కూడా దీనిపై తీవ్రంగా ఆందోళన చెందుతోంది. చైనాలో ప్రధాన భూభాగంలో 2002-3లో సంభవించిన తీవ్రమైన అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ , SARS అంటువ్యాధిలో ఎక్కువ మంది మరణించారు. ఆ వైరస్ వ్యాప్తి సమయంలో 349 మంది మరణించారు. ఇప్పుడు అంతకంటే ఎక్కువమంది మరణించారు.

దీనిపై ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూనే.. రోగులకు అవసరమైన చికిత్సను అందిస్తోంది ప్రభుత్వం. కరోనా వైరస్ ప్రభావంతో చాలా చోట్ల కృత్రిమ ఆసుపత్రులను ఏర్పాటు చేశారు. ఇందులోనే కరోనా రోగులకు చికిత్స అందిస్తున్నారు. అయితే వైరస్ సోకినట్టు నిర్ధారణ అయితే ఇక్కడే ఏర్పాటు చేసిన ఐసోలేషన్ వార్డులలో వీరిని ఉంచుతున్నారు. కాగా చైనా ఆరోగ్య కమిషన్ బుధవారం కొత్త గణాంకాలు వెల్లడించింది. ఒక్క మంగళవారంలోనే 65 మంది మరణించారని , అలాగే 3,887 మందికి వైరస్ సోకినట్టు తేలింది. ఇప్పటివరకు, 24,324 మందికి వ్యాధి సోకినట్లు తెలిసింది.

మరోవైపు తాజాగా.. చైనా నుండి వచ్చే ప్రయాణికులపై హాంకాంగ్ 14 రోజుల నిర్బంధాన్ని విధించింది. ఇదిలావుంటే చైనా పాస్‌పోర్ట్‌లు ఉన్న వారికి, చైనాలో నివాసం ఉంటున్న ఇతర దేశాల వారికి భారత్ వీసా జారీ తాత్కాలికంగా నిలిపివేసిన సంగతి తెలిసిందే.. తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు ఈ ఉత్తర్వులు కొనసాగుతాయని ప్రభుత్వం తెలపగా.. భారత్‌కు వచ్చిన 58,658 మంది ప్రయాణీకులకుల్లో 142 మంది కరోనా వైరస్‌ అనుమానితులను గుర్తించారు. వారికి కరోనా పరీక్షలు నిర్వహించగా 128 మంది నమూనాలు నెగెటివ్‌ ఉందని తేలింది. ఇక వుహాన్‌ నుంచి గతవారం వచ్చిన 330 మంది ప్రయాణీకులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు సన్నాహక చర్యలపై ఎప్పటికప్పుడు ఉన్నతస్ధాయి సమీక్ష నిర్వహిస్తోంది భారత ప్రభుత్వం.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories